New GST Rate Cut : కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. చౌకగా లభించనున్న టీవీలు, ఏసీలు.. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు తగ్గుతాయా?
New GST Rate Cut : కొత్త జీఎస్టీ రేట్లతో టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్ల ధరలు తగ్గనున్నాయి. ఫోన్లు, ల్యాప్‌టాప్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు..

new GST rate cut on mobile phones
New GST Rate Cut : కొత్త స్మార్ట్ ఫోన్లు, ఏసీలు, టీవీలు, ల్యాప్‌టాప్ ఏదైనా కొనేందుకు చూస్తున్నారా? కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఎలక్ట్రానిక్స్ ధరలు భారీగా తగ్గనున్నాయి. అయితే, జీఎస్టీ రేటు 5శాతం, 18శాతం శ్లాబ్‌లను తగ్గించి సవరించిన రెండు-లెవల్ రేటు నిర్మాణంతో జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది.
టీవీలు, ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్లు వంటి (New GST Rate Cut) కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ 28శాతం నుంచి 18శాతం జీఎస్టీ శ్లాబ్‌కు మారినప్పుడు వాటి ధర తగ్గుతుంది. అయితే, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై 18శాతం పన్ను అలానే కొనసాగుతుంది.
వస్తువులు, సేవల పన్ను (GST) కౌన్సిల్ 5శాతం, 18శాతం అనే రేటును కేంద్రం ఆమోదించింది. కొత్త జీఎస్టీ సంస్కరణలను ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్లాబ్‌లను తగ్గించినట్టు తెలిపారు. అంటే.. ఇకపై రెండు స్లాబ్‌లు మాత్రమే ఉంటాయని అన్నారు. సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. చాలావరకు టీవీలు, ఏసీలు, డిష్ వాషర్లు, వాషింగ్ మిషన్ల ధరలు తగ్గనున్నాయి.
జీఎస్టీ రేటు తగ్గింపు కింద ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు వంటి చాలా ఎలక్ట్రానిక్స్ పాత 28శాతం స్లాబ్ నుంచి 18శాతం జీఎస్టీకి మారుతాయి. తద్వారా డిష్‌వాషర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు చౌకగా మారనున్నాయి. అయితే, జీఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ధరలు తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుత జీఎస్టీ 18శాతం అలానే ఉంటుంది. కాగా, సవరించిన కొత్త పన్ను రేట్లు ఏయే ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ప్రభావం చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ధరలు తగ్గవు :
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై ప్రభావం పడుతుంది. స్మార్ట్‌ఫోన్ కేటగిరీకి సంబంధించి కేంద్రం డిఫాల్ట్ పన్ను స్లాబ్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం, మొబైల్ ఫోన్‌లపై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. ఇది అలాగే కొనసాగుతుంది. దీని అర్థం.. స్మార్ట్‌ఫోన్‌ల ధరలో ఎలాంటి తగ్గింపు ఉండదు. అదేవిధంగా, ల్యాప్‌టాప్‌లపై జీఎస్టీ 18శాతం వద్ద మారదు.
టీవీల ధరల తగ్గింపు :
టీవీలపై జీఎస్టీ రేట్లను కూడా కేంద్రం తగ్గించింది. ఇప్పుడు ప్రస్తుత 28శాతం పన్ను స్లాబ్ నుంచి 18శాతం పన్ను స్లాబ్‌కు తరలించారు. తద్వారా టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి.
ఏసీలు, డిష్ వాషర్ల ధరలు తగ్గింపు :
లేటెస్ట్ జీఎస్టీ సంస్కరణల ప్రకారం.. ఏసీలు, డిష్‌వాషర్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏసీలు, డిష్ వాషర్లపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. నివేదికల ప్రకారం.. మోడల్‌ను బట్టి ఎయిర్ కండిషనర్లు దాదాపు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు చౌకగా మారవచ్చు.