GST 2.0 Effect : పండగ బొనాంజా.. రేపటినుంచే జీఎస్టీ అమల్లోకి.. భారీగా తగ్గనున్న కార్లు, బైకుల ధరలు.. కొత్త ధరల ఫుల్ లిస్ట్ ఇదిగో..!
GST 2.0 Effect : జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కార్లు, బైక్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయి. మారుతి, టాటా మోటార్స్, హ్యుందాయ్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

GST 2 0 Effect
GST 2.0 Effect : ప్రముఖ వాహన తయారీ సంస్థలు మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా పండగ బొనాంజాను ప్రకటించాయి. సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి కార్ల ధరలను భారీగా తగ్గించనున్నాయి. ఈ పండగ సీజన్ సమయంలో ముఖ్యంగా లగ్జరీ కార్ల తయారీదారులు మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ అలాగే ద్విచక్ర వాహన తయారీదారులు కొత్త జీఎస్టీతో ధరలను తగ్గించనున్నారు. ఈ పండుగ సీజన్‌లో జీఎస్టీ తగ్గింపుతో ఆటోమేకర్లు ఏయే కార్లపై ఎంత ధర తగ్గించారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
GST 2.0 Effect : మారుతి సుజుకి కార్ల ధరలు తగ్గింపు :
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని అందించేందుకు వాహనాల ధరలను రూ.1.29 లక్షల వరకు తగ్గించింది. ద్విచక్ర వాహన వినియోగదారులు ఫోర్ వీలర్ వాహనాలకు మారేలా కంపెనీ 8.5 శాతం జీఎస్టీ ప్రయోజనానికి అదనంగా చిన్న కార్ల ధరలను తగ్గించాలని నిర్ణయించింది.
ఎంట్రీ లెవల్ మోడల్ S ప్రెస్సో ధరలు రూ.1,29,600 వరకు తగ్గుతాయి. ఆల్టో K10 రూ.1,07,600 వరకు తగ్గుతాయి. సెలెరియో రూ.94,100 వరకు తగ్గుతాయి. వాగన్-ఆర్ రూ.79,600 వరకు, ఇగ్నిస్ రూ.71,300 వరకు తగ్గుతాయి. చిన్న కార్లనే కాకుండా, గ్రాంట్ విటారా, బ్రెజ్జాతో సహా SUV సెగ్మెంట్‌పై కూడా కంపెనీ ధరలను తగ్గించింది.
ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల ధరలివే :
- S ప్రెస్సో ధర రూ.1,29,600 వరకు తగ్గుతుంది.
- ఆల్టో K10 ధర రూ.1,07,600 వరకు తగ్గనుంది.
- సెలెరియో ధర రూ.94,100 తగ్గుతుంది.
- వ్యాగన్-R ధర రూ.79,600 వరకు తగ్గుతుంది.
- ఇగ్నిస్ ధర రూ. 71,300 వరకు తగ్గుతుంది.
ఇతర మారుతి కార్ల ధరల తగ్గింపు :
- స్విఫ్ట్ ధర రూ. 84,600 వరకు
- బాలెనో ధర రూ. 86,100 వరకు
- టూర్ S ధర రూ.67,200 వరకు
- డిజైర్ ధర రూ. 87,700 వరకు
- ఫ్రాంక్స్ ధర రూ.1,12,600 వరకు
SUV కార్ల ధరల తగ్గింపు :
- ఫ్రాంక్స్ రూ.1,12,600 వరకు
- బ్రెజ్జా ధర రూ.1,12,700 వరకు
- గ్రాండ్ విటారా ధర రూ. 1.07 లక్షల వరకు
- జిమ్నీ ధర రూ. 51,900 వరకు
- ఎర్టిగా ధర రూ.46,400 వరకు
- XL6 ధర రూ. 52,000 వరకు
- ఇన్విక్టో ధరలు రూ.61,700 వరకు
- ఈకో రూ.68,000 వరకు,
- సూపర్ క్యారీ LCV రూ.52,100 వరకు
టాటా మోటార్స్ కార్ల ధరలివే :
టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలు సెప్టెంబర్ 22 నుంచి వరుసగా రూ. 75,000 నుంచి రూ. 1.45 లక్షల వరకు తగ్గుతాయి. ముంబైకి చెందిన కంపెనీ కాంపాక్ట్ SUV పంచ్ ధర రూ. 85వేలు, నెక్సాన్ ధర రూ. 1.55 లక్షలు తగ్గుతాయి. మిడ్-సైజ్ మోడల్ కర్వ్ ధర కూడా రూ.65,000 తగ్గనుంది. కంపెనీ ప్రీమియం ఎస్‌యూవీ కార్లలో హారియర్, సఫారీ ధరలు వరుసగా రూ.1.4 లక్షలు, రూ.1.45 లక్షల తగ్గనున్నాయి.
మహీంద్రా-మహీంద్రా ఇప్పటికే ప్యాసింజర్ వాహన రేంజ్‌పై రూ.1.56 లక్షల వరకు ధర తగ్గింపును ప్రకటించింది. కంపెనీ బొలెరో/నియో రేంజ్ ధరను రూ.1.27 లక్షలు, మహీంద్రా XUV3XO (పెట్రోల్) రూ.1.4 లక్షలు, మహీంద్రా XUV3XO (డీజిల్) రూ.1.56 లక్షలు, థార్ 2WD (డీజిల్) రూ.1.35 లక్షలు, థార్ 4WD (డీజిల్) రూ.1.01 లక్షలు, స్కార్పియో క్లాసిక్ రూ.1.01 లక్షలు తగ్గించింది.
హ్యుందాయ్ కార్లపై ధర వెర్నాలో రూ.60,640 నుంచి ప్రీమియం SUV టక్సన్‌లో రూ.2.4 లక్షల వరకు తగ్గింపు అందించనుంది. సెప్టెంబర్ 22 నుంచి హోండా కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ధరలను రూ.95,500 వరకు, సిటీ ధరలను రూ.57,500 వరకు, ఎలివేట్ ధరలను రూ.58,400 వరకు తగ్గించనుంది.
అదేవిధంగా, కియా ఇండియా కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గించనుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ కార్ల ధరలను సోమవారం నుంచి రూ.3.49 లక్షల వరకు తగ్గించనుంది. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ బైక్‌లు, స్కూటర్‌ల ధర రూ.15,743 వరకు తగ్గనుంది. హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా మోడల్ రేంజ్ 350cc వరకు ధరలు రూ.18,800 వరకు తగ్గనున్నాయి.
లగ్జరీ కార్ల ధరలు తగ్గింపు :
సరసమైన కార్లతో పాటు లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా తగ్గాయి. మెర్సిడెస్-బెంజ్ కూడా జీఎస్టీ 2.0 కింద రూ. 2 లక్షల (A-క్లాస్) నుంచి రూ. 10 లక్షల (S-క్లాస్) వరకు ధరల తగ్గింపును ప్రకటించింది. బీఎండబ్ల్యూ మోటార్ ఇండియా కూడా మినీ రేంజ్ సహా ఇండియా పోర్ట్‌ఫోలియో అంతటా రూ. 13.6 లక్షల వరకు ధరల తగ్గింపును ప్రకటించింది.
ఆడి కార్ మోడళ్లలో భారత్ మార్కెట్లో రూ. 2.6 లక్షల నుంచి రూ. 7.8 లక్షలకు పైగా ధరల తగ్గింపును ప్రకటించింది. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇప్పటికే రూ. 4.5 లక్షల నుంచి రూ. 30.4 లక్షల వరకు వాహన ధరలను తగ్గించింది.
చౌకగా మారనున్న బైకులివే.. కొత్త ధరలు
సెప్టెంబర్ 22 నుంచి ఈ కొత్త జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత చౌకగా బైక్‌లు లభించనున్నాయి. మోటార్ సైకిళ్ళు 29 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. 350cc కన్నా తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లపై పన్ను ప్రయోజనాలు అందిస్తోంది. గతంలో, ద్విచక్ర వాహన విభాగంపై ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి 29 శాతం నుంచి 31 శాతం వరకు పన్ను విధించింది. ఇప్పుడు, ఈ రేటును 18 శాతానికి తగ్గించింది. కానీ,ఏయే బైక్‌లు చౌకగా మారనున్నాయో ఇప్పుడు చూద్దాం..
బజాజ్ :
- ప్లాటినా
- సిటి 100
- పల్సర్ 125, NS125
- పల్సర్ 150
- ఫ్రీడమ్ 125
- అవెంజర్ 180
- పల్సర్ NS200
- పల్సర్ 200
- అవెంజర్ 220
- డామినార్ 250, N250
హీరో :
- డెస్టిని 125
- ప్లెజర్
- జూమ్
- HF డీలక్స్
- ప్యాషన్
- స్ప్లెండర్
- గ్లామర్
- ఎక్స్‌పల్స్
- ఎక్స్‌ట్రీమ్
- కరిజ్మా
హోండా :
- యాక్టివా
- డియో
- షైన్
- లివో
- యునికార్న్
- ఎస్పీ160
రాయల్ ఎన్ ఫీల్డ్ :
- క్లాసిక్ 350
- హాంటర్ 350
- మెటియర్ 350
- బుల్లెట్ 350