BIG FM Auto Expo : బిగ్ ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన బిగ్ ఎఫ్‌ఎమ్.. ప్రదర్శనకు కొత్త మోడల్ కార్లు!
ప్రధానంగా హర్ష టొయోటా, పీపీఎస్ వోక్స్‌వ్యాగన్, మహీంద్రా వంటి బ్రాండ్ అనేక కొత్త మోడల్ కార్లతోఎక్ప్‌పోలో పాల్గొంటున్నాయి. ఈవెంట్‌లో ప్రత్యేక ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
BIG FM Auto Expo : దేశంలోని ప్రముఖ రేడియో నెట్‌వర్క్‌లలో ఒకటైన బిగ్ ఎఫ్ఎమ్ కూకట్‌పల్లిలోని అశోకా వన్ మాల్‌లో బిగ్ ఆటో ఎక్స్‌పోను ప్రారంభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో విభిన్న కార్ బ్రాండ్‌లు సరికొత్త మోడల్‌లు, ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచారు. ప్రధానంగా హర్ష టొయోటా, పీపీఎస్ వోక్స్‌వ్యాగన్, మహీంద్రా వంటి బ్రాండ్ అనేక కొత్త మోడల్ కార్లతోఎక్ప్‌పోలో పాల్గొంటున్నాయి. ప్రతీ బ్రాండ్ తమ అత్యాధునిక వాహనాలను ప్రదర్శిస్తూ హాజరైన ఔత్సాహికులకు సందేహాలతోపాటు అనేక అంశాలకు సంబంధించి వివరణ అందిస్తారు.
Read Also : iPhone Call Recording : ఐఓఎస్ 18.1 అప్‌డేట్.. ఐఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్.. ఆ యూజర్లకు మాత్రమే..!
బిగ్ ఆటో ఎక్స్‌పోలో అతిథులను బ్రాండ్ ప్రతినిధులతో నేరుగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తుంది. వాహనాల పనితీరును పరీక్షించడమే కాకుండా ఈవెంట్‌లో ప్రత్యేక ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆటోమోటివ్ ఔత్సాహికులు, కార్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన అనుభవాలను అందించడమే లక్ష్యంగా బిగ్ ఎఫ్ఎమ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్బంగా బిగ్ ఎఫ్ఎమ్ సీఓఓ, సునీల్ కుమారన్ మాట్లాడుతూ.. ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్‌లను ఆసక్తిగల కొనుగోలుదారులతో డైనమిక్ ఇంటరాక్టివ్ కోసం ఒకచోట చేర్చడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. బిగ్ ఆటో ఎక్స్‌పో అన్ని కార్ల కొనుగోలుదారులు, ఔత్సాహికుల కోసం రూపొందించింది. ఆటోమోటివ్ టెక్నాలజీ, డిజైన్‌లో సరికొత్తగా అన్వేషించడానికి అద్భుతమైన అవకాశాన్ని ఈ వేదికగా అందిస్తున్నామని అన్నారు. ఈ బిగ్ ఆటో ఎక్స్‌పో అశోకా వన్ మాల్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.