సెప్టెంబర్ 11న విడుదల : కొత్త స్కూటీ..సైడ్ స్టాండ్ వేసి ఉంటే స్టార్ట్ కాదు

  • Publish Date - September 8, 2019 / 02:02 PM IST

కొత్త స్కూటీ మార్కెట్‌లోకి వస్తోంది. కొన్ని ప్రత్యేకతలతో రిలీజ్ కానుంది. సైడ్ స్టాండ్ వేసి ఉంటే..ఈ బండి అసలు స్టార్ట్ కాదు. అలా రూపొందించింది కంపెనీ. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSE) తొలి BS – 6 వెహికల్ హోండా యాక్టివా 125 FI సెప్టెంబర్ 11న మార్కెట్‌లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది కంపెనీ యాజమాన్యం. తొలి బీఎస్ – 6 వాహనం ఇదే కావడం విశేషం. 2020, ఏప్రిల్ 01న మార్కెట్‌లోకి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఏడు నెలల ముందే హోండా యాక్టివా 125 బీఎస్ – 6 వాహన విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 

ఇక ఈ వాహన విషయానికి వస్తే..125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండనుందని కంపెనీ వెల్లడిస్తోంది. ప్రత్యేక ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (PGM-FI), ఎన్ హాన్స్‌డ్ స్మార్ట్ పవర్‌ను జత చేసినట్లు తెలిపింది. బీఎస్  -6 యాక్టివా, బీఎస్ -4 యాక్టివా పోలిన విధంగానే ఉన్నా..స్వల్ప మార్పులు చేసినట్లు పేర్కొంది. హెడ్ లైట్ ముందు భాగం, సైడ్ ప్యానెల్స్‌లో మార్పులు చేయడం జరిగిందని, అలాగే సైడ్ స్టాండ్ వేసి ఉంటే..ఇంజిన్ ఆన్ కాకుండా కొత్త టెక్నాలజీని పొందుపరిచినట్లు తెలిపింది. బీఎస్ – 4 వాహనంతో పోలిస్తే..బీఎస్ – 6 ధర 10 నుంచి 15 శాతం అదనంగా ఉండే అవకాశం ఉందని అంచనా.