బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్ : అదనపు డాటా సేవలు కొనసాగింపు 

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు వినియోగదారులకు అందిస్తున్న అదనపు డాటా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది.

  • Publish Date - January 31, 2019 / 08:41 PM IST

బీఎస్‌ఎన్‌ఎల్‌ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు వినియోగదారులకు అందిస్తున్న అదనపు డాటా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది.

ఢిల్లీ : వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్‌ జియోకు పోటీ ఇచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వినియోగదారులకు అందిస్తున్న అదనపు డాటా సేవలను కొనసాగించాలని నిర్ణయించింది. సెలక్ట్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో అందిస్తున్న రోజుకు 2.2జీబీ డాటా ఆఫర్‌ను ఏప్రిల్‌30 వరకు పొడిగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ అదనపు డాటా ఆఫర్‌ రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ. 999 ప్రీపెయిడ్ మొబైల్‌ రీఛార్జ్‌పై, రూ.187, రూ.333, రూ.349, రూ.444, రూ. 448 ప్రీపెయిడ్ ఎస్టీవీ రీఛార్జ్ పై అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వీటితో పాటు ఒక సంవత్సరం వర్తించేలా ఎస్టీవీ1699, ఎస్టీవీ2099 రీఛార్జ్‌లను కూడా ఈ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది.

మరో టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్‌-ఐడియా కూడా సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చిది. రూ.154తో రీఛార్జ్‌ చేసుకుంటే 600 నిమిషాల లోకల్‌ వాయిస్‌ కాల్స్‌ను ఆరు నెలలు వర్తించేలా అందిస్తున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే ఇతర నెట్‌వర్క్‌ లోకల్, నేషనల్ కాల్‌ అయితే సెకన్‌కు 2.5 పైసలు, 10కేబీ డాటాకి 4పైసలు, లోకల్‌ ఎస్‌ఎంఎస్‌కి రూ.1, నేషనల్‌ ఎస్‌ఎంఎస్‌కైతే రూ. 1.5గా కంపెనీ నిర్ణయం తీసుకుంది.