BSNL Holi Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు హోలీ ఆఫర్.. వార్షిక ప్లాన్‌తో 30 రోజుల ఫ్రీ వ్యాలిడిటీ.. 60GB ఎక్స్‌ట్రా డేటా..!

BSNL Holi Offer : హోలీ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. ఈ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీని ఫ్రీగా అందిస్తోంది. 60GB అదనపు డేటా పొందవచ్చు.

BSNL Holi Offer

BSNL Holi Offer : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ హోలీ పండుగ సందర్భంగా యూజర్లకు బెస్ట్ ఆఫర్ అందిస్తోంది. కంపెనీ ప్లాన్లలో ఒక ప్లాన్ వ్యాలిడిటీని ఒక నెల పొడిగించింది. అంటే.. కంపెనీ ఈ అందించే ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తోంది.

Read Also : LIC Scheme : మీకు నెల జీతం వచ్చిందా? ఎల్ఐసీలో వండర్‌ఫుల్‌ స్కీమ్.. జస్ట్ రూ. 200 డిపాజిట్ చేస్తే.. రూ.20 లక్షలు సంపాదించవచ్చు!

అంతేకాదు.. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో 60GB డేటా కూడా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు హోలీ ఆఫర్‌తో బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 425 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. మీరు రీఛార్జ్ చేసిన తర్వాత దాదాపు 14 నెలల పాటు టెన్షన్ ఫ్రీగా ఉంటారు. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ధర రూ. 2399కు అందిస్తోంది. ఈ ప్లాన్‌లో లభించే మరిన్ని బెనిఫిట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

బీఎస్ఎన్ఎల్ రూ.2399 ప్లాన్ బెనిఫిట్స్ :
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్ గతంలో 395 రోజుల వ్యాలిడిటీతోపాటు రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ బెనిఫిట్స్ అందించింది. కానీ, హోలీ పండుగ సందర్భంగా, బీఎస్ఎన్ఎల్ 30 రోజుల ఫ్రీ వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. అంటే, కస్టమర్లు ఇప్పుడు 425 రోజుల వ్యాలిడిటీ మొత్తం 850GB డేటాను పొందవచ్చు.

Read Also : Oneplus Sale : వన్‌ప్లస్ హోలీ స్పెషల్ సేల్.. ఈ 5 వాటర్‌ప్రూఫ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

ప్లాన్ బెనిఫిట్స్ ఇవే :
బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్‌లో లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ధర రోజుకు దాదాపు రూ.5.6 కాగా ఈ బెనిఫిట్స్ 14 నెలల పాటు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుంది అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు.