Oneplus Sale : వన్‌ప్లస్ హోలీ స్పెషల్ సేల్.. ఈ 5 వాటర్‌ప్రూఫ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Oneplus Sale : వన్‌ప్లస్ హోలీ 'రెడ్ రష్ డేస్ సేల్ సందర్భంగా లేటెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Oneplus Sale : వన్‌ప్లస్ హోలీ స్పెషల్ సేల్.. ఈ 5 వాటర్‌ప్రూఫ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Oneplus Sale

Updated On : March 4, 2025 / 5:15 PM IST

OnePlus Red Rush Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ నెలలో హోలీ పండుగ వస్తోంది. ముందుగానే వన్‌‍ప్లస్ ‘రెడ్ రష్ డేస్ సేల్’ ప్రారంభమైంది. వన్‌ప్లస్ ఈ సేల్‌లో కస్టమర్‌లు వన్‌ప్లస్ లేటెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లు OnePlus 13, OnePlus 12, OnePlus Nord C4 సిరీస్‌లపై అద్భుతమైన ఆఫర్లు, డీల్స్ పొందవచ్చు. వన్‌ప్లస్ సేల్ మార్చి 4 నుంచి ప్రారంభమై మార్చి 9 వరకు కొనసాగుతుంది. వన్‌ప్లస్ ఈ సేల్‌లో ఏ ఫోన్‌పై ఎంత డైరెక్ట్ డిస్కౌంట్, ఎంత బ్యాంక్ డిస్కౌంట్ ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Pakistan Gold : ‘కేజీఎఫ్’ను మించి.. పాకిస్తాన్‌లో రూ.80వేల కోట్ల బంగారం.. ఇకనైనా దశ తిరుగుతుందా?

వన్‌ప్లస్ 13 :
వన్‌ప్లస్ 13 ఫోన్ (Red Rush Days) సేల్‌లో కొనుగోలుదారులు రూ. 5వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. దాంతో పాటు, వన్‌ప్లస్ 13Rపై రూ. 2వేల డైరెక్ట్ డిస్కౌంట్ రూ. 3వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై వర్తిస్తాయి.

వన్‌ప్లస్ 13 ఇటీవల భారత మార్కెట్లో రూ. 69,999కు ప్రారంభమైంది. వన్‌ప్లస్ 13 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6,000mAh సిలికాన్ నానోస్టాక్ బ్యాటరీ, 50ఎంపీ ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ ఎక్స్‌పోజర్ అల్గోరిథం, క్లియర్ బరస్ట్ యాక్షన్ మోడ్ వంటి అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

వన్‌ప్లస్ 12 :
వన్‌ప్లస్ 12 కొనుగోలు చేసే వారికి కంపెనీ వన్‌ప్లస్ 12 ధరను రూ. 8వేలు తగ్గించింది. దాంతో పాటు, ఈ ఫోన్‌పై రూ. 4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ బెనిఫిట్స్ అందిస్తోంది. దీని కారణంగా మొత్తం డిస్కౌంట్ రూ. 12వేలు అవుతుంది. వన్‌ప్లస్ 12 ప్రస్తుతం రూ. 56,999కు అమ్ముడవుతోంది. వన్‌ప్లస్ 12 సిరీస్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్, అద్భుతమైన 2కె 120Hz ప్రోXDR డిస్‌ప్లే స్పీడ్ 100W సూపర్‌వూక్ ఛార్జింగ్, హాసెల్‌బ్లాడ్ కెమెరా ఉన్నాయి.

వన్‌ప్లస్ 12ఆర్ :
వన్‌ప్లస్ 12ఆర్ కొనుగోలుదారులు ఈ ఫోన్‌ను రూ. 10వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్, రూ. 3వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ :
హోలీకి ముందు ప్రారంభమయ్యే ఈ వన్‌ప్లస్ స్పెషల్ సేల్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ ఫోన్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.వెయ్యి వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌లన్నింటినీ (OnePlus.in) ఆఫ్‌లైన్ పార్టనర్ స్టోర్‌ల నుంచి పొందవచ్చు.

Read Also : LIC Scheme : మీకు నెల జీతం వచ్చిందా? ఎల్ఐసీలో వండర్‌ఫుల్‌ స్కీమ్.. జస్ట్ రూ. 200 డిపాజిట్ చేస్తే.. రూ.20 లక్షలు సంపాదించవచ్చు!

వన్‌ప్లస్ నార్డ్ CE4 :
వన్‌‍ప్లస్ నార్డ్ CE4 ఫోన్ కొనుగోలుపై కస్టమర్లకు రూ.2వేల ధర తగ్గింపు అందిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 కొనుగోలు చేసే కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.2వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ600 ప్రైమరీ సెన్సార్ ఉంది. 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, ఫోన్ ఫ్రంట్ సైడ్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.