మీరు BSNL కస్టమర్లా? మీకో గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ భారీగా ఆఫర్లు ప్రకటిస్తోంది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు వరుస క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. గతనెలలోనే కంపెనీ.. ప్రతి 5 నిమిషాల వాయిస్ కాల్స్ పై 6 పైసలు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు SMSలపై కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్లను BSNL అందిస్తోంది.
ఇదే 6 పైసల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను SMSలకు కూడా పొడిగించింది. అంటే.. మీ BSNL ఫోన్ నెంబర్ నుంచి పంపే ప్రతి SMSకు ఇప్పటి నుంచి క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. మీరు చేయాల్సిందిల్లా.. ‘ACT 6 paisa’ అని మీ ఫోన్ SMS కంపోజ్ బాక్సులో టైప్ చేసి.. 9478053334 అనే నెంబర్’కు మెసేజ్ పంపితే చాలు.
ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ యాక్టివేట్ అయినట్టే. అప్పటి నుంచి మీరు పంపే ప్రతి SMSకు 6 పైసల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్.. ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, ఫైబర్ యూజర్ల కూడా డిసెంబర్ 31, 2019 వరకు అందుబాటులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే SMS పంపండి.. క్యాష్ బ్యాక్ పొందండి..