Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్‌పై కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్‌.. మామూలుగా లేవుగా..

ఈ మీమ్స్‌ చూస్తే పొట్టచక్కలయ్యేలా నవ్వుతారు..

Budget memes

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడంపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో మీమ్స్‌ వస్తున్నాయి. తమ కోసం బడ్జెట్‌లో ఏమైనా శుభవార్త చెబుతారేమోనని అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూశారు.

చాలా మందికి నిరాశ ఎదురైందని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు వాపోతున్నారు. నిర్మలమ్మ బడ్జెట్‌పై ఎప్పటిలాగే సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వర్షం కురుస్తోంది.

Union Budget 2025: గిగ్ వర్కర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం.. ఇకనుంచి వారికి మంచిరోజులు..

కొందరు సినిమా పాటలతో మీమ్స్ చేస్తే, మరికొందరు సినిమా డైలాగులతో మీమ్స్‌ సృష్టించారు. తమ బుర్రకు పదునుపెట్టి ఎంతో క్రియేటివిటీని వాడి చాలా మంది మీమ్స్‌ పోస్ట్ చేస్తున్నారు. అవి చూస్తే కడుపుబ్బా నవ్వకుండా ఉండలేరు.