Buying Gold Tips : బంగారం కొనేటప్పుడు జర జాగ్రత్త.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. డబ్బులు, బంగారం ఊరికే రావు కదా..!

Buying Gold Tips : బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను తప్పక గుర్తుంచుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం..

Buying Gold Tips

Buying Gold Tips : బంగారం ప్రియులకు అలర్ట్.. బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? చాలామంది బంగారం కొనేటప్పుడు కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోరు. భారత బులియన్ మార్కెట్లో బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. వివాహాలు లేదా ఇతర వేడుకలలో బంగారు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు.

మన సంస్కృతిలో బంగారు ఆభరణాలకు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా కూడా కొనుగోలు చేస్తారు. అలాంటి బంగారాన్ని కొనేముందు అనేక విషయాలపై అవగాహన తప్పక ఉండాలి.

Read Also : 8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. ఏ ఉద్యోగికి ఎంత జీతం పెరగనుంది? పూర్తి లెక్కలు మీకోసం..!

ఎందుకంటే.. డబ్బులు బంగారం ఊరికే రావు కదా.. కొంచె పొరపాటుగా ఆలోచించినా విలువైన బంగారంతో పాటు ఆర్థిక పరంగా నష్టపోవాల్సి వస్తుంది.. అయితే, బంగారం కొనే సమయంలో ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

బంగారం ధరలు ఎలా :
బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని గమనించాలి. సాధారణంగా ప్రతిరోజూ సమాయానికి అనుగుణంగా హెచ్చుతగ్గుదల కనిపిస్తుంటాయి అనేక అంశాల ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతుంది. కొనుగోలు చేసే ముందు రెండు మూడు షాపులకు తిరిగి ధరల గురించి తెలుసుకోవాలి. నమ్మదగిన వెబ్ సైట్లలో కూడా బంగారం రేట్లను చెక్ చేయొచ్చు.

బంగారం కొనుగోలు ఎలా? :
సాధారణంగా చాలామంది కొనుగోలుదారులు స్థానిక బంగారు షాపు వద్ద లేదా బ్రాండెడ్ ఆభరణాల షోరూంలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ఆయా వెబ్‌సైట్లు, ఎంఎంటీసీ వంటి ఇతర మార్గాలు ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారు కాయిన్స్ కొనుగోలు చేయాలంటే మాత్రం బ్యాంకులను కూడా సంప్రదించవచ్చు.

బంగారం స్వచ్ఛత :
బంగారం కొనుగోలు చేసే ముందు స్వచ్ఛత అనేది చాలా కీలకం. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం పరిగణిస్తారు. కానీ, మనం కొనుగోలు చేసే బంగారు ఆభరణాలు 22 క్యారెట్లుగా పరిగణిస్తారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు అనమాట.

తయారీ రుసుములు :
బంగారు షాపువాళ్లు ఆభరణాల డిజైన్ ఆధారంగా తయారీ రుసుములు మారుతూ ఉంటాయి. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన తర్వాత ఆభరణాలుగా తయారు చేసేందుకు 8 నుంచి 16 వాతం వరకు ఛార్జీలు విధిస్తాయి. తయారీ రుసుము, కొంత తరుగు రూపంలో మీ నుంచి వసూలు చేస్తారు.

హాల్ మార్కింగ్ ఉందా? :
గత కొన్ని ఏళ్లుగా బంగారంతో అనేక లాభాలు ఉన్నాయి. బంగారం కొనే సమయంలో అనేక విషయాలను గుర్తుంచుకోవాలి. కొద్దిగా పొరపాటు చేసినా భారీ నష్టం కలుగుతుంది. బంగారం అమ్మే సమయంలో అనేక మంది ఇలానే మోసపోతున్నారు. బంగారం కొనే సమయంలో ఆభరణాలపై హాల్‌మార్క్ గుర్తు ఉందో లేదో చూడాలి.

ఆభరణాలపై కనిపించే హాల్‌మార్క్ గుర్తు బంగారం స్వచ్ఛతను తెలియజేస్తుంది. అందుకే భారత ప్రభుత్వం BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్)ను ఏర్పాటు చేసింది. బంగారు ఆభరణాలపై బీఐఎస్ హాల్ మార్క్ ఉండాలి. బంగారంపై హాల్ మార్క్ లేకుంటే వెంటనే బీఐఎస్‌కు నేరుగా ఫిర్యాదు చేసి సంప్రదించవచ్చు.

బంగారం బరువు ఎంత? :
బంగారం ఎంత స్వచ్ఛతగా ఉంటే అంత విలువైనది. మీరు బంగారం కొనేందుకు గోల్డ్ షాపుకు వెళ్ళినప్పుడల్లా తయారీ ఛార్జీల గురించి అడిగి తెలుసుకోండి. చాలా బంగారు షాపుల్లో ఆభరణాల గురించి అడిగినప్పుడు తయారీ ఛార్జీలపై కొంతవరకు తగ్గింపు పొందవచ్చు. బంగారం కొనే సమయంలో తప్పనిసరిగా గోల్డ్ బరువు ఎంత ఉందో చెక్ చేయాలి.

Read Also : LIC Smart Pension Plan : ఈ ఎల్‌ఐసీ కొత్త స్కీమ్ భలే ఉందిగా.. ప్రీమియం ఒక్కసారి చెల్లిస్తే చాలు.. జీవితాంతం పెన్షన్ పొందొచ్చు..!

కొనుగోలు బిల్లు చెక్ చేసుకోండి :
బంగారం బరువులో కొద్ది వ్యత్యాసం ఉన్నా ధరలో భారీ వ్యత్యాసానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. గోల్డ్ షాప్ నుంచి బంగారం కొనుగోలు చేశాక సరైన బిల్లును తప్పక తీసుకోవాలి. బిల్లులో బంగారం క్యారెట్, బరువు, తయారీ ఛార్జీలు, పన్ను మొదలైన ముఖ్యమైన సమాచారం తప్పనిసరిగా ఉండాలి అనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోండి.

ఏ ఆభరణాలు కొంటే మంచిది :
బంగారు నగలను కొనుగోలు చేసేటప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు, హాల్ మార్కింగ్ ఛార్జీలు వర్తిస్తాయని గమనించాలి. ఎందుకంటే.. భవిష్యత్తులో మీరు కొన్న బంగారాన్ని తిరిగి విక్రయిస్తే.. ఆ ఛార్జీలు తిరిగిరావు. సాధారణంగా రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువగా వేస్టేస్ ఉంటుంది. రాళ్లు ఎక్కువగా లేని ఆభరణాలనే పసిడి ప్రియులు కొనుగోలు చేయడం ఎంతైనా మంచిది.