Silver
Silver: వెండి కొంటున్నారా? అయితే, కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదంటే మార్కెట్లో జరిగే మోసాలకు మీరూ బాధితులయ్యే ఛాన్స్ ఉంది. వెండి శుద్ధతను “999, 925, 958” సంఖ్యలు సూచిస్తాయి.
999 (ఫైన్ సిల్వర్): 99.9% శుద్ధత ఉంటుంది. చాలా మృదువుగా, మెరుపు అధికంగా ఉంటుంది. బార్లు, నాణేలు, వెండి పాత్రలు, ధార్మిక వస్తువులలో ఈ వెండిని వాడతారు. దీని మృదుత్వం కారణంగా ఆభరణాలకు ఇది అంతగా అనుకూలంగా ఉండదు.
925 (స్టెర్లింగ్ సిల్వర్): 92.5% వెండి, 7.5% ఇతర లోహాలు (సాధారణంగా రాగి) ఉంటాయి. దీంతో ఆభరణాలు, ఉపకరణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.
958 వెండి (బ్రిటానియా సిల్వర్): 95.8% వెండి ఇది. స్టెర్లింగ్ కంటే మృదువుగా ఉంటుంది. భారతదేశంలో అరుదుగా కనిపిస్తుంది.
ఇతర గ్రేడ్‌లు: 900 (90% వెండి) పురాతన వస్తువుల్లో, 800-850 (80-85% వెండి) యూరోపియన్ వారసత్వ వస్తువుల్లో కనిపిస్తాయి.
వెండి శుద్ధతకు ఉన్న ప్రాధాన్యం ఇదే..
శుద్ధత తెలుసుకోవడం వల్ల నాణ్యత తక్కువ ఉండే వెండి వస్తువులకు అధిక ధర చెల్లించే ప్రమాదం తగ్గుతుంది. వెండి పూత ఉన్నవి లేదా తక్కువ గ్రేడ్ వస్తువులను నిజమైన వెండిగా చూపుతూ వ్యాపారుల చేసే మోసాన్ని అడ్డుకోవచ్చు. మీరు పెట్టుబడి కోసం వెండి కొంటే ఒక రకమైన శుద్ధత ఉన్న వెండిని, బహుమతులు, రోజువారీ వినియోగం కొంటే మరో రకమైన వెండిని కొనడానికి ఉపయోగపడుతుంది.
Also Read: ఒరేయ్ దమ్ముంటే నాతో ఫేస్ టు ఫేస్ రండ్రా: సినీనటి ప్రగతి
కొనుగోలు చేసే ముందు వెండి శుద్ధతను ఇలా తనిఖీ చేయండి..
ఇంట్లో ఈజీగా చేసే పరీక్షలు
ల్యాబ్‌లో చేసే పరీక్షలు కచ్చితమైనవి. ఇంట్లో చేసే పరీక్షలు కూడా నకిలీలను గుర్తించడంలో సాయపడతాయి.
మాగ్నెట్ (అయస్కాంత) పరీక్ష: నిజమైన వెండి మాగ్నెట్‌ను ఆకర్షించదు. అంటే అతుక్కుపోదు. ఆకర్షణ ఉంటే ఇనుము, నికెల్ లేదా నకిలీ మిశ్రమాలు ఉన్నాయని గుర్తించాలి.
ఐస్ పరీక్ష: వెండికి అధిక ఉష్ణ ప్రసరణ సామర్థ్యం (వేడిని వేగంగా పంపించే లక్షణం) ఉంటుంది. నిజమైన వెండిపై ఉంచిన ఐస్ త్వరగా కరుగుతుంది.
బట్టతో పరీక్ష: నిజమైన వెండి ఆక్సీకరణ చెందుతుంది. బట్టతో తుడిచినప్పుడు నలుపు మచ్చలు కనిపించవచ్చు. ఆక్సీకరణ అంటే గాలిలోని ఆక్సిజన్‌తో స్పందించి రంగు మారే ప్రక్రియ.
ఈ పై పరీక్షలు ప్రాథమిక పరీక్షలే. కచ్చితత్వం కోసం ప్రొఫెషనల్ పరీక్షలు అవసరం.
కొనుగోలు చేసేముందు మరిన్ని సూచనలు