PM-Surya Ghar : సోలార్ స్కీమ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్..!

PM-Surya Ghar : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనుంది.

Centre OKs Solar Scheme To Give 1 Crore Families 300 Units Of Free Power A Month

PM-Surya Ghar Muft Bijli Yojana : సోలాక్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ స్కీమ్‌ను మోదీ ప్రకటించారు. ఈ సోలార్ స్కీమ్‌లో భాగంగా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది. ఇందుకోసం రూ.75,021 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనుంది.

Read Also : Reliance Disney Merger : రిలయన్స్-డిస్నీ మీడియా బిగ్ డీల్.. చైర్‌పర్సన్‌గా నీతా అంబానీ.. ఒకేచోటకు మొత్తం 120 టీవీ ఛానళ్లు!

ఆర్థిక సాయం కూడా :
కేబినేట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దీని కింద కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ స్కీమ్ కింద అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ఒక కిలోవాట్ సోలార్ సిస్టమ్‌కు రూ .30వేలు, 2 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌కు రూ.60వేలు, 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్‌కు రూ .78వేలకు పైగా కేంద్రం ఆర్థిక సహాయం అందించనుంది.

సోలార్ విలేజ్ నిర్మించే దిశగా :
గ్రామీణ ప్రాంతాల్లో సైతం రూఫ్ టాప్ సోలార్ ప్రోత్సహించనుంది. ప్రతి జిల్లాలో సోలార్ విలేజ్ నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. పీఎం-సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ అమర్చుతారు. సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలా విద్యుత్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు.. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. రూఫ్ టాప్ సోలార్ సాయంతో అదనంగా 30గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దాంతో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి.

దరఖాస్తు చేయాలంటే? :
పీఎం-సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులు ముందుగా https://pmsuryaghar.gov.in వెబ్ సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిద్వారా సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టాల్ చేసేందుకు వెండర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ కోసం ప్రస్తుతం 7శాతం పూచీకత్తు లేని తక్కువ వడ్డీతో రుణ ఉత్పత్తులను పొందవచ్చు. ఈ స్కీమ్ కింద సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు అకౌంట్లలోనే జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Read Also : PM Surya Ghar Solar Scheme : ఉచిత విద్యుత్ కోసం ‘రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్’.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు