Cheaper Netflix Plans in India : భారత్‌లో చౌకైన నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లు ఇవే.. యాడ్ సపోర్టెడ్ ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ మీకోసం..!

Cheaper Netflix Plans in India : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం (Netflix) కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించేందుకు చౌకైన యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ (Cheaper Netflix Plans in India)లను అందించేందుకు రెడీగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ఏడాది చివరిలో కొత్త ప్లాన్‌లను లాంచ్ చేయనుంది.

Cheaper Netflix plans with ads launching soon_ List of Netflix plans in India, prices, and benefits

Cheaper Netflix Plans in India : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం (Netflix) కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించేందుకు చౌకైన యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ (Cheaper Netflix Plans in India)లను అందించేందుకు రెడీగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లను మరింత మందిని ఆకట్టుకునేందుకు ఈ ఏడాది చివరిలో కొత్త ప్లాన్‌లను లాంచ్ చేయనుంది. గతకొన్ని నెలలుగా నెట్‌ఫ్లిక్స్ పేమెంట్ సబ్‌స్క్రైబర్‌లు భారీగా తగ్గిపోతున్నారు. అందులోనూ మార్కెట్‌లో గట్టి పోటీ కూడా ఎదురవుతోంది.

దాంతో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ డిమాండ్ తగినట్టుగా యూజర్లను పెంచుకునేందుకు చౌకైన యాడ్-సపోర్టు ప్లాన్‌లను ధరలను అందిస్తోంది. ఇప్పటికే ఉన్న యూజర్లతో పాటు కొత్త యూజర్ల కోసం ప్రయత్నిస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, మైక్రోసాఫ్ట్ యాడ్ నెట్‌వర్క్ యాడ్-సపోర్టు ప్లాన్‌లను అందించనుంది. మైక్రోసాఫ్ట్ నెట్‌ఫ్లిక్స్ టెక్నాలజీ, సేల్స్ పార్టనర్‌గా కంపెనీ మొదటి యాడ్-సపోర్టు సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌తో వచ్చింది.

ఈ ప్లాన్‌ల ధరపై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్యాక్‌లను ప్రారంభించనున్నట్టు ధృవీకరించింది. నెట్‌ఫ్లిక్స్ చౌకైన, యాడ్-సపోర్టెడ్ టైర్‌ను ఎలా అందించాలో అనేదానిపై యోచిస్తోంది. భారత మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ అందించే ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌లలో రూ. 149 నుంచి ప్లాన్‌లను కలిగి ఉంది. మీరు ఎంచుకున్న టెలికాం లేదా DTH రీఛార్జ్‌లతో పాటు ప్లాట్‌ఫారమ్‌కు ఉచితంగా యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ల వివరాలు అధికారిక వెబ్‌సైట్, యాప్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Cheaper Netflix plans with ads launching soon_ List of Netflix plans in India

భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ నెలవారీ ప్లాన్‌లు ఇవే :
రూ. 149 ప్లాన్ :
నెట్‌ఫ్లిక్స్ అందించే ఈ మొబైల్ ప్లాన్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో 480p స్ట్రీమింగ్‌తో వీడియో క్వాలిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌కి సమయంలో ఒక డివైజ్‌కు మాత్రమే యాక్సెస్‌ని అనుమతిస్తుంది.

రూ. 199 ప్లాన్ :
ఇది బేసిక్ ప్లాన్ ఫోన్, మీరు వాడే డివైజ్‌ల్లో టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీలో 480p స్ట్రీమింగ్‌ను కూడా అందిస్తుంది.

రూ. 499 ప్లాన్ :
నెట్‌ఫ్లిక్స్ అందించే ప్లాన్లలో స్టాండర్డ్ ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ ద్వారా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీలో 480p స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. డివైజ్ లిమిట్ ఒకదానికి లిమిట్ అందిస్తోంది. అలాగే ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీలో 1080p స్ట్రీమింగ్ అందిస్తోంది. అయితే ఈ ప్లాన్‌లు ఒకేసారి రెండు డివైజ్‌ల్లో స్ట్రీమింగ్‌కు సపోర్టు ఇస్తాయి.

రూ. 649 ప్లాన్ :
ఇది ప్రీమియం ప్లాన్.. మీరు వాడే స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ లేదా టీవీలో 4K HDR స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. ఒకేసారి నాలుగు డివైజ్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ప్లాన్ ఖరీదైనప్పటికీ, పెద్ద ఫ్యామిలీలకు అధిక రిజల్యూషన్‌ను ఇష్టపడే యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple IPhone 14 Series: భారత్‌లో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులోకి ఎప్పుడొస్తుంది? ధరలు ఎలా ఉన్నాయంటే?