CMF Phone 1 Price : ఆఫర్ అదిరింది భయ్యా.. అతి తక్కువ ధరకే నథింగ్ CMF ఫోన్ 1 కొనేసుకోండి.. డోంట్ మిస్!
CMF Phone 1 Price : నథింగ్ CMF ఫోన్ 1 ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఈ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

CMF Phone 1 Price
CMF Phone 1 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి నథింగ్ CMF ఫోన్ 2 మోడల్ అతి త్వరలో రానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 28న ఈ కొత్త ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ CMF ఫోన్ 2 లాంచ్ కన్నా ముందే వినియోగదారులు నథింగ్ CMF ఫోన్ 1 కొనుగోలుపై భారీగా మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపులతో కొనుగోలుదారులు ఈ ఫోన్ కొనుగోలుపై సుమారు రూ. 5వేలు ఆదా చేసుకోవచ్చు. దేశంలో రూ. 14,999 ధరకు లభించే ఈ స్మార్ట్‌ఫోన్.. కస్టమైజడ్ ఆప్షన్లు, అనేక అదనపు అప్లియన్సెస్ విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంది.
Read Also : Tech Tips : మీ ఫోన్ వేడెక్కుతోందా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వేసవిలో మొబైల్ కూలింగ్ కోసం 5 అద్భుతమైన టిప్స్ ఇవే!
రూ. 15వేల కన్నా తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫోన్ అని చెప్పవచ్చు. కస్టమర్లు ఇప్పుడు బ్యాంక్ ఆఫర్లతో సహా దాదాపు రూ.12,500 ధరకు ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీరు కొత్త స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. అమెజాన్‌లో CMF ఫోన్ 1 డీల్ అసలు వదులుకోవద్దు. ఈ ఫోన్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్‌లో CMF ఫోన్ 1 ధర ఎంతంటే? :
ప్రస్తుతం అమెజాన్‌లో CMF ఫోన్ 1 లాంచ్ ధర రూ.14,999 నుంచి రూ.13,980కి అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్లు రూ.1,500 వరకు బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.12,500 కన్నా తక్కువకు తగ్గుతుంది. కొనుగోలుదారులు నెలకు రూ.678 EMI బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులు తమ పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ. 13,250 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. యాడ్-ఆన్‌లలో భాగంగా కొనుగోలుదారులు అదనపు మొబైల్ వారంటీ, మొబైల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్యాక్‌లను కూడా ఎంచుకోవచ్చు.
CMF ఫోన్ 1 స్పెసిఫికేషన్లు :
సీఎంఎఫ్ ఫోన్ 1 6.67-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 2వేల నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G చిప్‌సెట్‌తో మాలి జీపీయూతో పనిచేస్తుంది. 8GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.
Read Also : iPhone 15 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. రూ.80వేల ఐఫోన్ 15 కేవలం రూ.32,950 మాత్రమే.. డోంట్ మిస్!
మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని విస్తరించవచ్చు. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా, ఈ సీఎంఎఫ్ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా 16MPతో వచ్చింది.