Commercial LPG cylinder
LPG cylinder : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను శుక్రవారం తగ్గించింది. దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.
ALSO READ : Telangana assembly election : తెలంగాణలో భారాస, కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోల్లో ఓటర్లకు తాయిలాలు
నవంబర్ 16వతేదీ నుంచి అమల్లోకి వచ్చిన వాణిజ్య సిలిండర్‌పై రూ.57.5 వరకు ధరలు తగ్గించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గాయి. దీపావళికి ముందు సిలిండర్‌పై రూ. 101.5ల పెంపు తర్వాత ఉపశమనం పొందింది.సవరించిన ధరల ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1,775, కోల్‌కతాలో రూ.1,885, ముంబయి నగరంలో రూ.1,728, చెన్నైలో రూ.1,942 రూపాయలకు తగ్గింది.
ALSO READ : Telangana assembly election : ఒకే పేరుతో వేర్వేరు అభ్యర్థులు…తికమక పడుతున్న ఓటర్లు
ఈ నెల ప్రారంభంలో ఆయిల్ కంపెనీలు దేశవ్యాప్తంగా పలు చోట్ల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను గత రెండు నెలల్లో రెండవసారి పెంచాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర తగ్గింపు వల్ల వీటిపై ఎక్కువగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాలపై భారాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు.