కరోనా ఎఫెక్ట్ : షేర్ల బేజారుతో బంగారానికి డిమాండ్

  • Publish Date - March 23, 2020 / 07:24 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం బంగారానికి కలిసొచ్చింది. వైరస్‌ షేర్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లించడంతో హాట్‌మెటల్‌ కాస్ట్లీగా మారింది. బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.

బంగారానికి డిమాండ్‌ పెరగడంతో సోమవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.517 ఎగిసి రూ.40,875 పలికింది. ఇక కిలో వెండి ఏకంగా రూ.1259 పెరిగి రూ.37,102కు చేరింది. ప్రాణాంతక వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న ఆందోళనతో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత ఎగబాకుతాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.
 

See Also | కరోనావైరస్ : ఏపీలో ఇంటింటి ప్రచారం…10,000 మంది విదేశాల నుంచి వచ్చారని గుర్తింపు