Credit Card Cash : క్రెడిట్ కార్డ్‌‌తో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. లేదంటే అప్పుల పాలవుతారు..!

Credit Card Cash : క్రెడిట్ కార్డులతో క్యాష్ విత్‌డ్రా చేయొద్దు. క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేస్తే తీసుకున్న డబ్బు కన్నా భారీగా ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది.. పూర్తి వివరాలను తప్పక తెలుసుకోండి.

Credit Card Cash

Credit Card Cash : క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే. ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులను వాడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి.

ఇందులో డిస్కౌంట్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు మొదలైన అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. కానీ, క్రెడిట్ కార్డుతో ఎప్పుడూ కూడా ఏటీఎంల్లో నుంచి క్యాష్ విత్‌డ్రా చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్పదు అనుకుంటే మాత్రమే ఇలా చేయాలి.

Read Also : Gold Rush : లండన్ టు అమెరికా గోల్డ్ రష్.. బంగారం అంతా తరలించేస్తున్నారు!

అంతేకానీ, డెబిట్ కార్డు గీకినట్టుగా క్రెడిట్ కార్డు గీకుతూ పోతే భారీ ఛార్జీలతో బిల్లు తడిసి మోపెడు అవుతుందని తెలుసుకోవాలి. వాస్తవానికి, చాలా మంది క్రెడిట్ కార్డ్ వాడితే క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడం కూడా ఒక రకమైన రుణం అనే విషయాన్ని మర్చిపోతారు.

క్రెడిట్ కార్డును ఉపయోగించడం వల్ల అనేక లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగించి క్యాష్ విత్‌డ్రా చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ, క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ విత్‌డ్రా చేయడం చాలా రిస్క్ కూడా. ఇలా చేయడం వల్ల మీరు భారీ ఛార్జీలను చెల్లించాల్సి రావచ్చు.

క్రెడిట్ కార్డుపై ఛార్జీలు :
క్రెడిట్ కార్డును వాడేటప్పుడు.. మీరు అనేక రకాల ఛార్జీలు చెల్లించాలి. మీరు క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకుంటే మీరు ఇంకా ఎక్కువ ఛార్జీలు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ మొత్తంపై వసూలు చేసే వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. క్యాష్ డ్రా చేసిన తర్వాత పేమెంట్ చేయడం ఆలస్యం చేస్తే.. మీరు ప్రత్యేక పెనాల్టీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : 8th Pay Commission Update : బిగ్ అలర్ట్.. ఈసారి 2 విడతల్లో డీఏ విడుదల..? భారీగా పెరగనున్న పెన్షర్లు, ఉద్యోగుల జీతాలు..!

క్రెడిట్ కార్డ్‌పై క్యాష్ అడ్వాన్స్ ఫీజు :
మీరు క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేసినప్పుడల్లా మీరు క్యాష్ అడ్వాన్స్ రుసుము చెల్లించాలి. ఈ రుసుము విత్‌డ్రా చేసిన మొత్తంలో దాదాపు 2.5 నుంచి 3 శాతం ఉంటుంది. ఇది కాకుండా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఇతర చెల్లింపులపై కూడా అనేక రకాల ఛార్జీలు ఉంటాయి. అలాంటి పరిస్థితిలో మీ క్రెడిట్ కార్డ్ బిల్లు మీరు ఖర్చు చేసిన మొత్తం కన్నా చాలా ఎక్కువగా ఉండవచ్చు.