Gold Rush : లండన్ టు అమెరికా గోల్డ్ రష్.. బంగారం అంతా తరలించేస్తున్నారు!

Gold Rush : పసిడి పరిశ్రమ తరలిపోతోంది. లండన్ నుంచి న్యూయార్క్‌కు తరలిస్తున్నారు. బంగారం ధరల మధ్య ధర వ్యత్యాసానికి కారణం దిగుమతి సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలేనని నివేదికలు చెబుతున్నాయి.

Gold Rush : లండన్ టు అమెరికా గోల్డ్ రష్.. బంగారం అంతా తరలించేస్తున్నారు!

Gold rush

Updated On : February 18, 2025 / 4:25 PM IST

Gold Rush : టన్నుల కొద్ది బంగారం తరలిపోతోంది. లండన్ నుంచి కోట్ల విలువైన పసిడి భారీగా రవాణా అవుతోంది. లండన్ నుంచి బంగారమంతా అమెరికా బ్యాంకుల్లోకి వచ్చి చేరుతోంది. ఒక్కసారిగా భారీ మొత్తంలో బంగారం న్యూయార్క్‌కు తరలిపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే.. ట్రంప్ సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతో అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య అంతరాయం ఏర్పడి బంగారం మార్కెట్లో పెనుమార్పుకు దారితీసింది.

లండన్ నుంచి న్యూయార్క్‌కు బంగారం రవాణా :
వాణిజ్య అనిశ్చితుల కారణంగా అమెరికాలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాంతో లండన్ నుంచి న్యూయార్క్‌కు బంగారం నిల్వలను రవాణా చేసే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అమెరికా దిగ్గజ బ్యాంకులైన జేపీ మోర్గాన్ చేజ్, హెచ్‌ఎస్‌బీసీ సైతం రెండు బులియన్ మార్కెట్ల మధ్య ధరల అంతరాన్ని వినియోగించుకుంటున్నాయి.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? ఫిబ్రవరి 24నే వాయిదా విడుదల.. మీ కేవైసీ స్టేటస్, అర్హతను ఇలా చెక్ చేసుకోండి!

లండన్‌లో వాల్ట్‌ల నుంచి తమ బంగారు నిల్వలను స్వదేశానికి తరలిస్తున్నాయి. అట్లాంటిక్ మీదుగా బంగారాన్ని రవాణా చేయడానికి వాణిజ్య విమానాలను ఉపయోగిస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

బంగారం ధరలో హెచ్చుతగ్గులు :
అమెరికా వాణిజ్య విధానాలపై ఆందోళనల కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ సంవత్సరం న్యూయార్క్‌లో బంగారం ఫ్యూచర్స్ ధరలు 11 శాతం పెరిగాయి. దాంతో 2,909 డాలర్లకు చేరుకుంది. త్వరలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇంతలో, లండన్‌లో బంగారం ధరలు తగ్గాయి, డిసెంబర్ ప్రారంభం నుంచి ఔన్సుకు దాదాపు 20 డాలర్లు తగ్గాయి. ఈ బంగారం ధర త్వరలో మొదటిసారిగా ట్రాయ్ ఔన్సుకు 3వేల డాలర్లు దాటవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ ధరల అంతరానికి ట్రంప్ ఇటీవల చేసిన సుంకాల హెచ్చరికలే కారణమని చెబుతున్నారు. న్యూయార్క్‌లో పెరుగుతున్న బులియన్ ధరల దృష్ట్యా ఆయా బ్యాంకులు లండన్‌లోని ఖజానాల నుంచి స్విస్ రిఫైనరీల నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని అమెరికాకు తరలిస్తున్నాయి. ఈ నెలలో జేపీ మోర్గాన్ ఒక్కటే 4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని స్వదేశానికి తరలించాలని యోచిస్తోంది.

బంగారం రవాణా ఎలా జరుగుతుందంటే? :
బంగారం వంటి విలువైనవి తరలించడానికి భారీ భద్రత అవసరం. బ్యాంకులు బంగారాన్ని వాణిజ్య విమానాల్లో తరలిస్తున్నాయి. ముందుగా లోహన్ని హోల్డ్‌లలో లోడ్ చేసే ముందు లండన్ విమానాశ్రయాలకు హైపవర్డ్ వ్యాన్‌లలో రవాణా చేస్తున్నాయి. లండన్‌లో బంగారాన్ని అమెరికా బులియన్ మార్కెట్‌కు తగినట్టుగా ఉన్న బార్‌లతో ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి లోహాన్ని తరలిస్తున్నారు.

లండన్ బులియన్ మార్కెట్‌లో ఒడిదుడుకులు :
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విలువైన లోహాలకు ముఖ్య కేంద్రంగా ఉంది. 1697 నుంచి ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారాన్ని ఇక్కడే దాచుకున్నాయి. ప్రస్తుతం బంగారం ఎగుమతుల వరద లండన్‌లో అడ్డంకులను సృష్టించింది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారాన్ని తరలింపులో ఇబ్బంది ఎదుర్కొంటోంది. బంగారాన్ని తరలించే వ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా స్విస్ రిఫైనరీలు మూతపడ్డాయి. దాంతో విమానాలు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా బంగారం తరలింపునకు అంతరాయం కలిగింది. బంగారం మార్కెట్‌లో చివరిసారిగా పెద్ద క్షీణత సంభవించింది.

20 టన్నుల బంగారాన్ని తరలించిన భారత్ :
ఇంగ్లాండ్‌లో నిల్వ చేసిన 200 టన్నుల బంగారాన్ని ఇప్పటికే భారత్ స్వదేశానికి తరలించింది. 2024 మే, అక్టోబర్‌లలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుంచి వరుసగా 100 టన్నులు, 102 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది.

Read Also : PM Kisan 19th Installment : ఈ నెల 24నే పీఎం కిసాన్ డబ్బులు.. కానీ, ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. ఏం చేయాలంటే?

భారత్‌లో ఇప్పటికే 510.5 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితుల మధ్య ఇంత విలువైన బంగారాన్ని విదేశాలలో నిల్వ చేయడం భద్రతపరంగా ముప్పు ఉందని ఆర్బీఐ అంచనా వేసింది.

కొన్నాళ్లుగా రిజర్వ్ బ్యాంకు భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. దాంతో విదేశాల్లో మన బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. భారత్‌కు ఆ బంగారాన్ని స్వదేశానికి తరలించింది. దాంతో ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 855 టన్నులకు చేరుకున్నాయి.