Credit Card Tips : క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? బిల్లు విషయంలో ఈ మిస్టేక్స్ చేయొద్దు.. లేదంటే వడ్డీతో మీ జేబుకు చిల్లే..!
Credit Card Tips : క్రెడిట్ కార్డు బిల్లు విషయంలో కొన్ని అంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బిల్లు జనరేట్ అయిన దగ్గర నుంచి బిల్లు చెల్లించే వరకు.. కొనుగోలు చేసిన తేదీ నుంచి డ్యూట్ డేట్ వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card Tips
Credit Card Tips : క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. క్రెడిట్ కార్డ్ బిల్లు ప్రతి నెలా జనరేట్ అవుతుంది. 45 రోజుల వడ్డీ లేని వ్యవధిని ఎలా లెక్కించాలో తెలుసా? ఒకవేళ బిల్లు కట్టడం ఆలస్యమైతే వడ్డీ ఎలా పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి. ముందుగా 45 రోజుల వడ్డీ లేని కాలానికి, మీరు బిల్లింగ్ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయినప్పుడల్లా 30 రోజుల కాలానికి ఉంటుంది. బిల్లు చెల్లించడానికి మీకు దాదాపు 15 రోజుల సమయం ఉంటుంది.
Read Also : JioMart Offers : కొత్త ఏసీ కొంటున్నారా? జియోమార్ట్‌లో సగం ధరకే ఏసీలు.. 3 టాప్ బ్రాండ్ల ఏసీలు మీకోసం..!
క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు వినియోగదారులకు 45 రోజుల వడ్డీ లేని వ్యవధిని ఇస్తామని పేర్కొంటున్నాయి. అంటే.. మీరు 45 రోజులు ఖర్చు చేసిన డబ్బుకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మందిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు ప్రతి నెలా జనరేట్ అవుతుంది. మరి 45 రోజుల వడ్డీ రహిత కాలం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే..
బిల్లింగ్ సైకిల్‌ను అర్థం చేసుకోండి :
45 రోజుల వడ్డీ లేని కాలానికి, మీరు బిల్లింగ్ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయినప్పుడల్లా అది 30 రోజుల కాలానికి ఉంటుంది. బిల్లు చెల్లించడానికి మీకు దాదాపు 15 రోజుల సమయం లభిస్తుంది. అప్పటి వరకు మీరు బిల్లు చెల్లించకపోయినా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, 30 రోజులు, 15 రోజులు కలిపి మొత్తంగా 45 రోజుల వడ్డీ రహిత వ్యవధిని లెక్కిస్తారు.
45 రోజులు ఎప్పుడు రావు? :
మీరు మొదటి రోజే కొనుగోలు చేసినప్పుడు 45 రోజుల వడ్డీ రహిత వ్యవధి అందుబాటులో ఉంటుంది. అంటే.. మీరు జనవరి 1న ఏదైనా కొనుగోలు చేస్తే.. దానికి చెల్లించడానికి మీకు 45 రోజుల సమయం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నెలలో రోజులు పెరిగేకొద్దీ బిల్లుల చెల్లింపు వ్యవధి తగ్గుతుంది. ఉదాహరణకు.. మీరు జనవరి 30న ఏదైనా కొనుగోలు చేస్తే.. దానికి డబ్బు చెల్లించడానికి మీకు 15 రోజులు మాత్రమే ఉంటాయి.
15 రోజుల్లోగా చెలిస్తే వడ్డీ పడదు :
ఏ నెలలోనైనా 1వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య జరిగే ఖర్చులకు బిల్లు తదుపరి నెలలో జనరేట్ అవుతుంది. జనవరి నెలలో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లు ఫిబ్రవరి నెలలో జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ బిల్లు చెల్లించడానికి వినియోగదారులకు మరో 15 రోజుల సమయం ఉంటుంది. అంటే.. వినియోగదారులు ఫిబ్రవరి 15 లోపు బిల్లు చెల్లిస్తే.. వారు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.
45 తర్వాత బిల్లుకు వడ్డీ కట్టాల్సిందే :
వడ్డీ రహిత వ్యవధి ఎంతకాలం ఉంటుందో తెలుసుందాం. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ బిల్లుల ఆలస్య చెల్లింపుపై వడ్డీని ఎంతకాలం లెక్కించాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 45 రోజుల తర్వాత బిల్లులు చెల్లిస్తే.. వారు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వడ్డీ చివరి తేదీ నుంచి కాకుండా లావాదేవీ రోజు ప్రకారం లెక్కిస్తారు. క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించాలి.