Credit Suisse – UBS: క్రెడిట్ సూయిస్ ఉద్యోగుల్లో సగానికి‌పైగా తొలగించేందుకు యూబీఎస్ సిద్ధమైంది.

యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి ఈనెల ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపుపై ముందుగానే హెచ్చరించారు. రాబోయే నెలల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

Credit Suisse - UBS

Credit Suisse – UBS: యూబీఎస్ గ్రూప్ బ్యాంక్ టేకోవర్ ఫలితంగా వచ్చేనెలలో క్రెడిట్ సూయిస్ నుంచి సగానికిపైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. లండన్, న్యూయార్క్, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోని క్రెడిట్ సూయిస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లోని బ్యాంకర్లు, వ్యాపారులు, సహాయక సిబ్బంది దాదాపు అన్ని కార్యకలాపాలు ప్రమాదంలో పడతాయని నివేదిక పేర్కొంది. క్రెడిట్ సూయిస్‌లో 45వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, యూబీఎస్‌తో ఒప్పందం తరువాత సంయుక్తంగా 1.20లక్షలకు ఉద్యోగుల సంఖ్య పెరిగింది. రాబోయే సంవత్సరాల్లో సిబ్బంది ఖర్చుల్లో ఆరు బిలియన్ల డాలర్లు ఆదా చేయడం లక్ష్యంగా యూబీఎస్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Reliance JioMart Layoffs : కోత మొదలైంది.. జియోమార్ట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. మరో 9వేల జాబ్స్ తగ్గించే అవకాశం..!

2023లో బ్యాంక్ మూడు దఫాలుగా ఉద్యోగుల తొలగింపు చేపడుతున్నదని తెలుస్తోంది. వచ్చే నెలలో మొద దఫాలో కొంత మంది ఉద్యోగులను తొలగించనుంది. రెండో దఫాలో సెప్టెంబర్, మూడో దఫా ఉద్యోగుల తొలగింపు అక్టోబర్ లో ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. స్విస్ బ్యాంక్ మొత్తం ఉద్యోగుల సంఖ్యను సుమారు 30శాతం తగ్గించే ఆలోచనలో ఉందట.

యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి ఈనెల ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపుపై ముందుగానే హెచ్చరించారు. రాబోయే నెలలు ఎగుడుదిగుడుగా ఉండే అవకాశం ఉంది. విలీనానికి ముఖ్యంగా ఉపాధికి సంబంధించి కష్టమైన నిర్ణయాలు అవసరమవుతాయని చెప్పారు. క్రెడిట్ సూస్ చరిత్ర చూసుకుంటే.. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ సూస్. ఈ బ్యాంక్‌కు 167 ఏళ్ల చరిత్ర ఉంది. సంక్షోభంలో కూరుకుపోతున్న ఆ బ్యాంకును అదే దేశానికి చెందిన అతిపెద్ద బ్యాంకు యూబీఎస్ గ్రూప్ టేకోవర్ చేసుకుంది. ఈ డీల్‌లో స్విట్జర్లాండ్ ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించింది.