DA Announcement Delay
DA Announcement Delay : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారుల డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపుపై ప్రకటన ఆలస్యమవుతోంది. డీఏ, డీఆర్ ప్రకటన ఆలస్యంపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పండగ సీజన్‌కు ముందుగానే డీఏ పెంపు ఉంటుందని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఇప్పటివరకూ డీఏ పెంపుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దాంతో ఉద్యోగుల్లో (DA Announcement Delay) నిరాశ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. పండుగ సీజన్‌కు ముందు సకాలంలో డీఏ చెల్లింపులు జరిగేలా తక్షణ జోక్యం చేసుకోవాలని లేఖలో కోరింది.
డీఏ పెంపు ఆలస్యంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. జూలై 1, 2025 నుంచి అమల్లోకి రావాల్సిన డీఏ, డీఆర్ బకాయిలను ఇంకా ప్రకటించలేదని కాన్ఫెడరేషన్ హైలైట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ చివరి వారంలో రెండోసారి డీఏ సవరణను ప్రకటించింది. సాధారణంగా కేంద్రం ప్రతి ఏడాదికి రెండు సార్లు డీఏ పెంచుతుంది. మొదటిసారి జనవరి నుంచి జూన్ వరకు, రెండోసారి జూలై నుంచి డిసెంబర్ వరకు ఇలా పెంచుతుంది. అలాగే, ఈ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదటివారంలో రెండోసారి డీఏ పెంపు ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికీ డీఏ పెంపుపై ఎలాంటి ఉత్తర్వులు జారీ కాకపోవడంపై ఉద్యోగులు, పెన్షన్‌దారులు నిరాశ చెందుతున్నారు. సెప్టెంబర్ నెల జీతంతో పెంచిన డీఏ కూడా అందుతుందని భావిస్తున్నారు. ఈ జాప్యంతో ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తిని కలిగించిందని లేఖలో పేర్కొంది. సాధారణంగా, ఉద్యోగులు సవరించిన జీతం లేదా పెన్షన్‌తో పాటు రెండు నుంచి 3 నెలల బకాయిలను పొందుతారు. నెలాఖరు సమీపిస్తుండటంతో చాలా మంది తమ సెప్టెంబర్ జీతాలతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏ కూడా పొందాలని ఆశిస్తున్నారు.
కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ CPI-IW ఆధారంగా డీఏ లెక్కిస్తారు. ఈ గణనలో వినియోగదారుల ధరల సూచిక గత 12 నెలల సగటుతో లెక్కించే ఫార్ములా ఉపయోగిస్తారు. ప్రస్తుత గణనలకోసం 2016 సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా తీసుకుంటున్నారు.
ఫార్ములా : గత 12 నెలల సగటు CPI-IW DA (%)= 261.42– 261.42/ 261.42×100
కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) ఆధారంగా డీఏని ద్రవ్యోల్బణంతో అనుసంధానించి లెక్కిస్తారు. ఈ గణనలో వినియోగదారుల ధరల సూచిక గత 12 నెలల సగటుతో లెక్కిస్తారు. ప్రస్తుత లెక్కలకు బేస్ ఇయర్ 2016 ఏడాదిని తీసుకుంటారు. CPI-IW, ద్రవ్యోల్బణాన్ని లేబర్ బ్యూరో ట్రాక్ ఉద్యోగులు, పెన్షనర్ల వాస్తవ ఆదాయాన్ని అంచనా వేస్తారు.
పండుగ సీజన్ బోనస్‌లు :
దసరా (దుర్గా పూజ), దీపావళి వరుస పండుగలు ఉండటంతో ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB), తాత్కాలిక బోనస్‌లపై కూడా ప్రకటనలు చేయాలని ప్రభుత్వాన్ని కన్ఫెడరేషన్ కోరింది. పండుగ సీజన్‌కు ముందు ఉద్యోగులు, పెన్షనర్లు ఉపశమనం కోసం సకాలంలో డీఏ పెంపు ప్రకటన అవసరమని యూనియన్ స్పష్టం చేసింది.
8వ వేతన సంఘంలో జాప్యం :
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక నోటిఫికేషన్, 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత వేతన కమిషన్లతో పోల్చితే ఈ 8వ వేతన సంఘం అమలుపై కూడా అధికారిక ప్రకటన ఆలస్యమవుతోంది. జూలై-డిసెంబర్ 2025 డీఏ సవరణ, 7వ వేతన సంఘం చివరి పెంపుగా ఉంటుంది. ఈ వేతన సంఘం వ్యవధి డిసెంబర్ 31, 2025తో ముగియనుంది.