Aadhaar Card Whatsapp : గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయొచ్చు.. క్షణాలో ఇలా పొందండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Aadhaar Card Whatsapp : వాట్సాప్ యూజర్లు ఇప్పటినుంచి వాట్సాప్‌లోనే ఆధార్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, డీజీలాకర్ అకౌంట్ ద్వారా యాక్సస్ చేయొచ్చు.

Aadhaar Card Whatsapp : గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయొచ్చు.. క్షణాలో ఇలా పొందండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Aadhaar Card Whatsapp

Updated On : September 24, 2025 / 4:31 PM IST

Aadhaar Card Whatsapp : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇప్పుడు వాట్సాప్ నుంచే నేరుగా ఆధార్ కార్డును పొందవచ్చు. భారతీయ పౌరులకు ఆధార్ అత్యంత ముఖ్యమైన ఐడీ కార్డు. గతంలో కన్నా ఆధార్‌ను యాక్సెస్ చేయడం చాలా సులభం. భారత ప్రభుత్వ అధికారిక (MyGov) హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా పౌరులు నేరుగా వాట్సాప్‌లో ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా లక్షలాది మంది వాట్సాప్ యూజర్లు అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

UIDAI నుంచి వాట్సాప్‌కు కొత్త ఇంటిగ్రేషన్ :
గతంలో భారతీయ పౌరులు UIDAI పోర్టల్ లేదా డిజిలాకర్ యాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మాత్రమే తమ ఆధార్ కార్డును తిరిగి పొందేవారు. ఈ కొత్త ఇంటిగ్రేషన్‌తో వినియోగదారులు ఇప్పుడు మల్టీ యాప్‌ల అవసరం ఉండదు. ఆధార్, ఇతర డిజిలాకర్-లింక్డ్ డాక్యుమెంట్‌లను సేఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోజువారీ కమ్యూనికేషన్ కోసం వాట్సాప్‌పై ఆధారపడే వ్యక్తులకు ఈ ఫీచర్ సర్వీసు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ వాట్సాప్ సర్వీసు కోసం ఏం చేయాలంటే? :

  • ఈ సర్వీసుకు మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్.
  • యాక్టివ్ డిజిలాకర్ అకౌంట్
  • అధికారిక MyGov హెల్ప్‌డెస్క్ వాట్సాప్ నంబర్ మీ కాంటాక్ట్‌లలో సేవ్ +91-9013151515 అయి ఉండాలి.

Read Also : Apple iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కొంటున్నారా? ఫస్ట్ ఈ దేశాల్లో ధర ఎంతో చెక్ చేయండి.. భారత్‌లో కన్నా చాలా చౌకగా కొనేసుకోవచ్చు!

వాట్సాప్‌లో ఆధార్ డౌన్‌లోడ్ కోసం సింపుల్ ప్రాసెస్ :

  • మీ కాంటాక్ట్‌లలో MyGov హెల్ప్‌డెస్క్ నంబర్ (+91-9013151515)ను సేవ్ చేయండి.
  • వాట్సాప్ ఓపెన్ చేసి “Hi లేదా “Namaste” అని టైప్ చేసి పంపండి.
  • ఆ తర్వాత చాట్‌బాట్ మెను నుంచి డిజిలాకర్ సర్వీసులను ఎంచుకోండి.
  • డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేయండి.
  • అథెంటికేషన్ తర్వాత చాట్‌బాట్ అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల లిస్టును డిస్‌ప్లే చేస్తుంది.
  • మీ ఆధార్‌ను ఎంచుకోండి. ఆధార్ కార్డును PDF ఫార్మాట్‌లో నేరుగా వాట్సాప్‌లో పొందవచ్చు.

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలివే :

  • ఒకేసారి ఒక డాక్యుమెంట్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • డౌన్‌లోడ్ చేసే ముందు ఆధార్‌ను డిజిలాకర్‌తో లింక్ చేయాలి.
  • లేదంటే వినియోగదారులు డిజిలాకర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా అప్‌డేట్ చేయవచ్చు.
  • ఈ సర్వీసు పూర్తిగా చాలా సేఫ్, యూజర్ ప్రైవసీ కూడా ఉంటుంది.

ఈ ఫీచర్ ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డులను ఫాస్ట్‌గా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దేశంలో వాట్సాప్ వినియోగం ఎక్కువగా ఉండటంతో ఈ ఫీచర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అధికారిక ఒరిజినల్ డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచుకోవచ్చు. అంతేకాదు.. ఆధార్ యాక్సెస్‌ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.