Apple iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 కొంటున్నారా? ఫస్ట్ ఈ దేశాల్లో ధర ఎంతో చెక్ చేయండి.. భారత్‌లో కన్నా చాలా చౌకగా కొనేసుకోవచ్చు!
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ అమెరికా, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల కన్నా భారత్‌లోనే అత్యంత ఖరీదైనది.

Buy iPhone 17 Series
Apple iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత మార్కెట్లో కొత్త ఐఫోన్ సిరీస్ చాలా ఖరీదైనది. మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో ఐఫోన్ 17 సిరీస్ చౌకైన ధరకే లభిస్తోంది. భారత్‌తో పోలిస్తే అమెరికాలోనే అతి చౌకైన ధరకు లభిస్తుంది.
కొన్ని ఐఫోన్ మోడళ్లపై మాత్రం ఏకంగా రూ. 20వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. భారతీయ (Apple iPhone 17 ) కొనుగోలుదారులు కొత్త ఐఫోన్ కొనే ముందు భారత్, అమెరికా, కెనడా, హాంకాంగ్, యూకే, యూఏఈ సహా ఇతర దేశాల్లో ఐఫోన్ 17 సిరీస్ ధర ఎంత ఉందో ఓసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాతే ఐఫోన్ 17 కొనడం బెటర్.
వాస్తవానికి, ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌తో పాటు ఫస్ట్ టైమ్ సన్నని ఐఫోన్ 17 ఎయిర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లను ఆపిల్ అవే-డ్రాపింగ్ ఈవెంట్ సందర్భంగా ఆవిష్కరించింది. సెప్టెంబర్ 19, 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఐపోన్ 17 సిరీస్ భారతీయ మార్కెట్లో ఆపిల్ అధికారిక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.

Buy iPhone 17
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ భారత్ ధరలివే :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్‌తో పోలిస్తే కొత్త ఐఫోన్‌లు స్వల్ప ధరతో లభ్యమవుతున్నాయి.
- ఐఫోన్ 17 : రూ. 82,900
- ఐఫోన్ 17 ఎయిర్ : రూ. 99,900 (సుమారుగా)
- ఐఫోన్ 17 ప్రో : రూ. 1,34,900
- ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : రూ. 1,49,900
- భారత్‌లోనే ఐఫోన్ 17 అసెంబుల్ అయినప్పటికీ దేశ మార్కెట్లో ధర ఇతర దేశాల్లో కన్నా ఎక్కువగా ఉంది.
ఐఫోన్ 17 గ్లోబల్ ధరలతో పోలిస్తే.. :
సెప్టెంబర్ 2025 మారకపు ధరల ఆధారంగా భారతీయ కరెన్సీలోకి ధరలను మార్చినప్పుడు ఇతర దేశాల్లో ఐఫోన్ 17 సిరీస్ ధర ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
- ఐఫోన్ 17 : రూ. 70,500 (US), రూ. 81,700 (UAE), రూ. 87,900 (UK), రూ. 1,28,800 (వియత్నాం)
- ఐఫోన్ 17 ఎయిర్ : రూ. 88,200 (US), రూ. 1,03,300 (UAE), రూ. 1,09,900 (UK), రూ. 1,05,400 (వియత్నాం)
- ఐఫోన్ 17 ప్రో : రూ. 97,000 (US), రూ. 1,13,000 (UAE), రూ. 1,20,900 (UK), రూ. 1,15,500 (వియత్నాం)
- ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : రూ. 1,05,800 (US), రూ. 1,22,500 (దుబాయ్), రూ. 1,31,900 (UK), రూ. 1,25,400 (వియత్నాం)
ఎక్కడ చౌకగా లభిస్తుందంటే? :
ఆపిల్ ఐఫోన్ 17 అన్ని మోడళ్లలో యునైటెడ్ స్టేట్స్ అత్యల్ప ధరలకు లభ్యమవుతుంది. ఉదాహరణకు.. ఆపిల్ బేస్ ఐఫోన్ 17 ధర భారత మార్కెట్‌తో పోలిస్తే అమెరికాలో దాదాపు రూ.12వేలు తక్కువ.
భారతీయులు విదేశాల్లో ఐఫోన్లు కొనాలా? వద్దా? :
మీకు అమెరికా, కెనడా లేదా హాంకాంగ్ నుంచి వచ్చే స్నేహితులు లేదా బంధువులు ఉంటే.. మీరు వారిని ఐఫోన్ కొని తీసుకురమ్మని అడగొచ్చు. అక్కడ అయితే చాలా చౌకైన ధరకే లభిస్తుంది. మీకు చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది. అయితే, కొనుగోలుకు ముందు వారంటీ, అమ్మకాల తర్వాత సర్వీసును చెక్ చేయాలి. ఎందుకంటే ఆపిల్ నిబంధనలు కొన్నిసార్లు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి.