×
Ad

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. వచ్చేవారమే DA పెంపు..? భారీగా పెరగనున్న వేతనాలు.. దీపావళి బోనస్ కూడా..!

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వచ్చేవారం వారి వేతనాల పెంపు ఉండే అవకాశం ఉంది. దీపావళి బోనస్ కూడా ప్రకటించే అవకాశం ఉంది.

DA Hike

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. వచ్చేవారమే డీఏ పెంపు అమల్లోకి రానుంది. దీపావళి బోనస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. కేంద్ర ఉద్యోగులు తమ డీఏ, డీఆర్ పెంపు, దీపావళి బోనస్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ప్రయోజనాల కోసం ఆసక్తిగా (DA Hike) ఎదురుచూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. కేంద్రం వచ్చే వారమే డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. సాధారణంగా, ప్రభుత్వం దీపావళికి ముందు డీఏను ప్రకటిస్తుంది. కానీ, ఈసారి ఇంకా నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు.

మంత్రివర్గ సమావేశం :
సెప్టెంబర్ 24న జరిగిన కేబినెట్ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతానికి సమానమైన వర్క్ ఆధారిత బోనస్‌ను ఆమోదించింది. అయితే, డీఏ లేదా డీఆర్ పెంపుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. సాంప్రదాయకంగా, సెప్టెంబర్ చివరి వారంలో డీఏ పెంపును ప్రకటిస్తారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలను అక్టోబర్ మొదటి వారంలో చెల్లిస్తారు.

Read Also : PM Kisan 21st installment : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ పథకం రూల్స్ మారాయి.. 21వ విడత విడుదల ఎప్పుడు? ఆ రైతులకు రూ. 2వేలు పడతాయా?

ఉద్యోగ సంఘాల అసంతృప్తి :
డీఏ పెంపు జాప్యంపై సెంట్రల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CCGEW) ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా సెప్టెంబర్ చివరి వారంలో డీఏ లేదా డీఆర్ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. అక్టోబర్ ప్రారంభంలో 3 నెలల బకాయిలు చెల్లిస్తారని జనరల్ సెక్రటరీ ఎస్.బి. యాదవ్ అన్నారు. ఈసారి డీఏ పెంపు జాప్యం ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీసింది.

డీఏ పెంపు ఎంత ఉండొచ్చు? :
ఈ పెంపుదల ఆమోదిస్తే మాత్రం డీఏ, డీఆర్ 3 శాతం పెరుగుతుంది. తద్వారా రేటు 55శాతం నుంచి 58శాతానికి పెరుగుతుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు భారీగా పెరుగుతాయి.

డీఏ ఎందుకు ముఖ్యమంటే? :
ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయంలో డియర్‌నెస్ అలవెన్స్ అత్యంత ముఖ్యమైనది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడమే దీని ఉద్దేశ్యం. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా నిర్ణయిస్తారు. జనవరి-జూన్, జూలై-డిసెంబర్‌లలో సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు.

7వ వేతన సంఘం చివరి పెంపు :
జూలై-డిసెంబర్ 2025లో జరగబోయే ఈ సవరణను 7వ వేతన సంఘం కింద చివరి పెంపుగా పరిగణిస్తారు. 8వ వేతన సంఘం జనవరి 2026 నుంచి అమలు కానుందని భావిస్తున్నారు. మొత్తంమీద, లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళికి ముందే ప్రకటిస్తే పండుగ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది.