PM Kisan 21st installment : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ పథకం రూల్స్ మారాయి.. 21వ విడత విడుదల ఎప్పుడు? ఆ రైతులకు రూ. 2వేలు పడతాయా?
PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడత అతి త్వరలో విడుదల కాబోతుంది. అయితే, అంతకన్నా ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రూల్స్ మార్చింది. అదేంటో తెలుసా?

PM Kisan Yojana
PM Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ యోజన) 21వ విడత కోసం ఎదురు చూస్తుంటే ఇది మీకోసమే.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నియమాలను మార్చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది.
భూమి యాజమాన్య పత్రాలు లేని రైతులకు (PM Kisan 21st installment) ఈ పథకం ఇప్పుడు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో రైతులను ఇప్పటివరకు ఈ పథకం నుంచి మినహాయించారు. ఈ యోజనలో పాక్షిక మార్పులతో భూమి పత్రాలు లేని రైతుల గుర్తింపును ప్రభుత్వం ధృవీకరిస్తుంది.
రైతులకు కలిగే ప్రయోజనాలివే :
సరిహద్దు ప్రాంతాల్లోని రైతులకు అవసరమైన భూమి పత్రాలు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలను విస్తరించే కొత్త నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాంటి సందర్భాలలో, రైతు వాస్తవానికి వ్యవసాయం చేస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాలి. ఈ ధృవీకరణ తర్వాత సంబంధిత రైతు పథకం తదుపరి విడతను పొందేందుకు అర్హులు అవుతారు.
దీపావళి నాటికి 21వ విడత విడుదల? :
దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ రైతులు ప్రస్తుతం 21వ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీపావళి నాటికి రైతుల ఖాతాలకు రూ. 2వేలు బదిలీ చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. పండుగకు ముందే రైతులకు శుభవార్త అందే అవకాశం ఉంది.
దీపావళి రోజున లేదా అంతకు ముందే అర్హులైన లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాలకు రూ. 2వేలు బదిలీ చేసే ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 2న కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతను విడుదల చేసింది. అక్టోబర్ 20 నాటికి రైతులకు తదుపరి విడత అందుతుందని భావిస్తున్నారు. అయితే, పీఎం కిసాన్ 21వ విడత అధికారిక తేదీ ఇంకా వెల్లడి కాలేదు.
ముందుగా రూ.2వేలు ఎవరికంటే? :
ఇప్పటివరకు ఈ పథకం కింద 20 వాయిదాలు దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల అయ్యాయి. అయితే, ఈసారి నియమాలు కొద్దిగా మారాయి. వరద ప్రభావిత రాష్ట్రాలలోని రైతులు ముందుగా 21వ విడతను అందుకునేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని రైతులు మొదటి విడత పొందవచ్చని పీఎం నరేంద్ర మోదీ ఇటీవల కూడా సూచనప్రాయంగా తెలిపారు.
కేవైసీ తప్పనిసరి :
పీఎం కిసాన్ రైతులు ఈ ముఖ్యమైన విషయాన్ని తప్ప గుర్తుంచుకోవాలి: e-KYC పూర్తి చేయకుండా పథకం డబ్బులు పొందలేరు. ఇ-కేవైసీ పెండింగ్ ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2వేలు క్రెడిట్ కావు. ఇందుకోసం రైతులు (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేసి లాగిన్ అవ్వాలి. హోమ్‌పేజీలో (e-KYC) ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
పీఎం కిసాన్ 21వ వాయిదా స్టేటస్ చెక్ చేయాలంటే? :
- పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) విజిట్ చేయండి.
- ‘Farmers Corner’ కి వెళ్ళండి.
- ‘Beneficiary Status’ పై క్లిక్ చేయండి.
- ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయండి.
- మీరు ఇప్పుడు ‘Beneficiary List’ కింద మీ గ్రామ జాబితాను చెక్ చేయవచ్చు.