Oppo F27 Pro Plus : ఒప్పోనా మజాకా.. అమెజాన్‌లో చౌకైన ధరకే ఒప్పో F27 ప్రో ప్లస్ కొనేసుకోండి.. ఈ డీల్ మీకోసమే..!

Oppo F27 Pro Plus : ఒప్పో కొత్త ప్రో ప్లస్ ధర డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఒప్పో F27 ప్రో ప్లస్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.

1/6Oppo F27 Pro Plus
Oppo F27 Pro Plus : ఒప్పో అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో ఒప్పో ఫోన్ ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఒప్పో F27 ప్రో+ 5G ధర రూ.10వేల కన్నా భారీగా తగ్గింది. ఈ హ్యాండ్‌సెట్ రూ.18వేల లోపు అందుబాటులో ఉంది.
2/6Oppo F27 Pro Plus
ఈ హ్యాండ్‌సెట్ బేస్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ రూ.27,999 ధరకు లాంచ్ అయింది. IP69-రేటెడ్ వాటర్-రెసిస్టెంట్, అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు ఆకట్టుకునే కెమెరా, హుడ్ కింద మీడియాటెక్ చిప్‌సెట్‌ కలిగి ఉంది. తక్కువ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తుంటే ఒప్పో F27 ప్రో ప్లస్ 5G సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6Oppo F27 Pro Plus
అమెజాన్‌లో ఒప్పో F27 ప్రో+ 5G డిస్కౌంట్ : ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.18,699కి విక్రయిస్తోంది. ధర రూ.9,300 తగ్గింపుతో లభిస్తుంది. అదనంగా, మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.1,250 బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తగ్గింపు తర్వాత ధర రూ.17,499 వరకు ఉంటుంది. ఇంకా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రూ.907 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.17,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.
4/6Oppo F27 Pro Plus
ఒప్పో F27 ప్రో ప్లస్ 5G స్పెసిఫికేషన్లు : ఒప్పో F27 5Gలో 6.7-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రా-నారో బెజెల్స్, 93శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 64MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
5/6Oppo F27 Pro Plus
ఏఆర్ఎమ్ (ARM) కార్టెక్స్-A78, కార్టెక్స్-A55 కోర్లతో మీడియాటెక్ 7050 SoC ద్వారా ఒప్పో F27 ప్రో 8GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంది.
6/6Oppo F27 Pro Plus
ColorOS 14పై రన్ అవుతుంది. అదనంగా, 67W సూపర్‌వూక్ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 44 నిమిషాల్లో 0 నుంచి 100శాతం, 20 నిమిషాల్లో 56శాతం వరకు ఛార్జ్ అవుతుంది.