బంగారం ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 10 గ్రాములు పసిడిధర ఇప్పుడు రూ.లక్షకు చేరింది. 1955లో 10 గ్రాముల బంగారం ధర రూ.79గా ఉండేది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,100కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,480 వద్ద కొనసాగింది.
ఏ ఏడాది బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
ఇప్పుడు?
2025 – రూ.90,150 (22 క్యారెట్ల బంగారం ధర)
2025 – దాదాపు రూ.లక్ష (24 క్యారెట్ల బంగారం ధర). ఇవాళ ఒక దశలో రూ.లక్షకు చేరుకుంది.
అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, భౌగోళిక పరిస్థితులు, అమెరికాలో వడ్డీ రేట్ల సవరింపులు, దేశాల మధ్య యుద్ధాల వల్ల బంగారం ధరలు పెరుగుతుంటాయి. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు చూస్తున్నారు.
గత పదేళ్లలో పెరిగిన తీరు
బంగారం ధరలు గత పదేళ్లలో 330 శాతం పెరిగాయి. అంటే, పదేళ్ల క్రితం మీరు బంగారంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు మీకు రూ.3.3 లక్షలు వచ్చేవి.
2015 నుంచి ఇప్పటివరకు ధరలు ఎలా పెరిగాయి?
2015 – రూ.26.3 వేలు
2016 – రూ.28.6 వేలు
2017 – రూ.29.6 వేలు
2018 – రూ.31.4 వేలు
2019 – రూ.35.2 వేలు
2020 – రూ.48.6 వేలు
2021 – రూ.48.7 వేలు
2022 – రూ.52.6 వేలు
2023 – రూ.65.3 వేలు
2024 – రూ.79.8 వేలు
2025 – రూ.లక్ష