వామ్మో.. ఒక్కరోజే రూ.20వేల కోట్ల విలువైన బంగారం కొనేశారు..

ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. పసిడికి డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది.

Gold Silver Sales (Photo Credit : Google)

Dhanteras 2024: ధన త్రయోదశి సందర్భంగా గోల్డ్, సిల్వర్ విక్రయాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా గోల్డ్, సిల్వర్ సేల్స్ జిగేల్ మన్నాయి. దేశవ్యాప్తంగా బుధవారం 20వేల కోట్ల విలువైన గోల్డ్, 2వేల 500 కోట్ల రూపాయల విలువైన వెండి అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. ధంతేరాస్ సందర్భంగా గోల్డ్, సిల్వర్ విక్రయాల విలువ గతేడాది పోలిస్తే భారీగా పెరిగాయి.

దేశవ్యాప్తంగా 20వేల కోట్ల విలువైన 25 టన్నుల బంగారం, 2వేల 500 కోట్ల విలువైన 250 టన్నుల వెండి అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే టర్నోవర్ కాస్త తగ్గినట్లు కనిపించినా.. సేల్స్ మరింత జోరుగా సాగే అవకాశం ఉంది. గతేడాది గోల్డ్, సిల్వర్ టర్నోవర్ 25 వేల కోట్ల రూపాయలుగా ఉండగా.. ఈ ఏడాది ఆ విలువ 30 నుంచి 32 వేల కోట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. పసిడికి డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది. ధంతేరాస్ సందర్భంగా అదే జోష్ కంటిన్యూ అయ్యింది. మంగళవారం ధంతేరాస్ సందర్భంగా అమ్మకాలు ఉదయం పూట అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం నుంచి పుంజుకున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎక్కువగా చిన్న ఐటెమ్స్, నాణెల కొనుగోలుకు గోల్డ్ ప్రియులు ఆసక్తి చూపారు. ధరలు అధిక స్థాయిలో ఉన్నా డిమాండ్ కూడా పటిష్టంగానే ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధిక ధరల వల్ల విలువ పరంగా అమ్మకాలు పెరిగినా.. పరిమాణం పరంగా మాత్రం తగ్గొచ్చని మరికొన్ని బులియన్ సంస్థలు తెలిపాయి.

Also Read : బాబోయ్.. మీరు బంగారం కొంటున్నారా.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే?