Dollar Millionaires : కరోనా కాలంలో భారత్‌లో పెరిగిన డాలర్ మిలియనీర్లు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

కరోనా కాలంలోనూ భారతీయ డాలర్ మిలియనీర్ల సంఖ్య పెరిగింది. దేశంలో డాలర్‌ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద) కలిగిన సంపన్నులు భారీగా పెరిగినట్టు ఓ సర్వేలో వెల్లడైంది.

Dollar Millionaires in India : కరోనా కాలంలోనూ భారతీయ డాలర్ మిలియనీర్ల సంఖ్య పెరిగింది. దేశంలో డాలర్‌ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద) కలిగిన సంపన్నులు భారీగా పెరిగినట్టు ఓ సర్వేలో వెల్లడైంది. 2021 కరోనా ప్రభావం ఉన్నప్పటికీ డాలర్ మిలియనీర్లు (Dollar millionaires in India) 11 శాతం మేర పెరిగినట్టు సర్వేలో తేలింది. డాలర్ మిలియనీర్లు వ్యక్తిగత సంపద పెరిగి 4.58 లక్షల కుటుంబాలకు చేరుకుందని హురున్‌ రిపోర్ట్‌ (Hurun Report) వెల్లడించింది. 130 కోట్లకుపైగా జనాభా కలిగిన దేశంలో పెరుగుతున్న అసమానతలపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నివేదిక బయటకు వచ్చింది.

ఇటీవల ఆక్స్‌ఫామ్‌ (Oxfam) విడుదల చేసిన నివేదికలో టాప్‌-100 భారతీయుల సంపద 775 బిలియన్‌ డాలర్లకు ఎగిసిందని తేలింది. 2021లో మొత్తం దేశ జనాభాలో 4.6 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి పడిపోయారని తెలిపింది. 2021 చివరి నాటికి ఒక సర్వే ప్రకారం… 350 మంది డాలర్ మిలియనీర్లు తమ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో సంతోషంగా ఉన్నారని, అయితే 2021లో వారి సంఖ్య 66శాతానికి పడిపోయిందని తెలిపింది. మునుపటి ఏడాదిలో 72శాతం నుంచి తగ్గిందని సూచించింది. హురున్‌ నివేదికతో దేశంలో మరింత పేదరికంలో జారిపోతుందనే ఆందోళనల్ని రేకిత్తించేలా ఉంది. ఈ సర్వేలో కేవలం 19 శాతం డాలర్‌ మిలియనీర్లే సమాజానికి తమ సంపదలో ఎంతో కొంతమొత్తాన్ని తిరిగిచ్చేయాలని భావిస్తున్నారట.

2026 నాటికి బిలియనీర్లు 6 లక్షలకు చేరొచ్చు :
భారతీయ డాలర్ మిలియనీర్ల సంఖ్య 30శాతం పెరిగి 2026 నాటికి 6 లక్షల కుటుంబాలకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. ముంబైలో 20,300 మంది వరకు అత్యధిక సంఖ్యలో డాలర్ మిలియనీర్లు ఉన్నారు. ఢిల్లీలో 17,400, కోల్‌కతాలో 10,500 మంది డాలర్ మిలియనీర్లు ఉన్నారని నివేదిక పేర్కొంది. అతి సంపన్నులపై పన్ను విధించాలనే డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అధిక పన్నులు విధించాలని ఆక్స్‌ఫామ్ సూచించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది పన్నులు చెల్లించడం సామాజిక బాధ్యతను తెలియజేస్తుందని హురున్ నివేదిక పేర్కొంది.

సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మంది తమ పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపేందుకు ఇష్టపడతారని చెప్పారు. యూకే, న్యూజిలాండ్ జర్మనీ తర్వాత అమెరికా ఇష్టమైన గమ్యస్థానంగా మారిందని తేలింది. కార్ల వినియోగంపై కూడా సర్వే కూడా దృష్టి సారించింది. ఈ జాబితాలో ఉన్నవారిలో నాలుగవ వంతు మంది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తమ కార్లను మారుస్తున్నారని కనుగొన్నారు. జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అత్యంత ప్రాధాన్యంగా మారింది. వాచ్ (Dollar Watch) కొనుగోలు చేయడం కూడా మిలియనీర్‌లకు అత్యంత ఇష్టమైన విషయంగా సర్వేలో తేలింది.

4 రకాల లగ్జరీ వాచ్‌లు వాడుతున్నారట..
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమకు నాలుగు రకాల లగ్జరీ వాచ్‌లను కలిగి ఉన్నారని సర్వే తెలిపింది. అందులో రోలెక్స్ (Rolex Watch) అత్యంత ప్రాధాన్య బ్రాండ్‌గా పేర్కొంది. అలాగే.. ఇండియన్ హోటల్స్ అత్యంత ప్రాధాన్యమైన హాస్పిటాలిటీ బ్రాండ్‌గా ఉద్భవించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని తనిష్క్ ఫేవరెట్ జ్యువెలరీ రిటైలర్‌గా అవతరించింది. లూయిస్ విట్టన్ అత్యంత ఇష్టపడే లగ్జరీ గూడ్స్ బ్రాండ్ గా అవతరించింది. గల్ఫ్‌స్ట్రీమ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రైవేట్ జెట్ బ్రాండ్ అని సర్వే తెలిపింది. వచ్చే దశాబ్దం లగ్జరీ బ్రాండ్‌లు, సర్వీస్ ప్రొవైడర్‌లకు భారత్‌లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఇదో అవకాశాన్ని అందిస్తుందని హురున్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ అన్నారు. కరోనా కాలంలో ఆన్ లైన్ పేమెంట్లు కూడా భారీగా పెరిగాయి. UPI ద్వారా పేమెంట్లు చేస్తున్న డాలర్ మిలియనీర్ల సంఖ్య రెట్టింపుగా 36శాతానికి చేరుకుంది. అయితే వారిలో దాదాపు మూడింట ఒకవంతు మంది ప్రస్తుతం తమ పెట్టుబడుల విషయంలో అనవసరమైన రిస్క్ ఎందుకని భావిస్తున్నారని నివేదిక తెలిపింది.

Read Also : india Top 10 billionaires :భారత్ లో 10 మంది బిలియనీర్ల సంపదతో దేశంలో పిల్లలందరికీ 25 ఏళ్లు విద్య అందించొచ్చు 

ట్రెండింగ్ వార్తలు