Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ ఫ్యాన్స్ మీకోసమే.. ఈ మడతబెట్టే ఫోన్ భారీ తగ్గింపు ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy Z Fold 6 : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

1/6Samsung Galaxy Z Fold 6
Samsung Galaxy Z Fold 6 : కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 1,64,999 ధరకు లభ్యమవుతోంది. ఈ మడతబెట్టే ఫోన్ రూ. 1 లక్ష లోపు ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు డ్యూయల్ అమోల్డ్ స్క్రీన్, ఫారమ్ ఫ్యాక్టర్, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
2/6Samsung Galaxy Z Fold 6
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర ఎంతంటే?: శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ప్రారంభ లాంచ్ ధర నుంచి భారీ ధర తగ్గింపుతో రూ.1,03,859కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.4వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర రూ.99,869కు పొందవచ్చు.
3/6Samsung Galaxy Z Fold 6
మీరు నెలకు రూ.3,652 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. కానీ, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
4/6Samsung Galaxy Z Fold 6
కస్టమర్లు పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. రూ. 60,200 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. కస్టమర్లు ఎక్కువ చెల్లించడం ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీ, మరిన్ని యాడ్-ఆన్‌ కూడా పొందవచ్చు.
5/6Samsung Galaxy Z Fold 6
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు : కొనుగోలుదారులు 6.3-అంగుళాల అమోల్డ్ మెయిన్ స్క్రీన్, 7.6-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ పొందవచ్చు. ఈ రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ కలిగి ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
6/6Samsung Galaxy Z Fold 6
4,400mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్‌తో సపోర్టు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్‌ అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 10MP, 4MP సెన్సార్‌లను కలిగి ఉంది.