Gold Rate Today : బంగారం ధరల్లో ఊహించని మార్పు.. నవంబర్ నెలలో లక్ష దిగువకు చేరుతుందా..! ఈ రేటు వద్దకు వస్తే కొనండి..
Gold Rate Today తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ...
Gold Rate Today
Gold Rate Today : బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత పదిహేను రోజుల నుంచి గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. అయితే, అక్టోబర్ నెలలో బంగారం లాభాలు నమోదు చేసినప్పటికీ.. చివరిలో ధరలు భారీగానే తగ్గాయి. నవంబర్ నెలలోనూ బంగారం ధర మరింత తగ్గబోతుందని.. రూ.లక్షకు దిగువకు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం ప్రస్తుతం అస్థిర స్థితిలో ఉన్నప్పటికీ, దీని దీర్ఘకాలిక దిశ ఇంకా బుల్లిష్‌గానే ఉంది. నవంబర్ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో ఇది 3,800 డాలర్ల నుండి 4,100 డాలర్ల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,16,000 నుంచి రూ. 1,22,000 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.ఈ ట్రేడ్ మధ్యలో లాభాలు బుక్ అయ్యే అవకాశం ఉంది.ఇక వెండి పారిశ్రామిక డిమాండ్ ఆధారంగా మరింత స్థిరంగా ఉంటుంది. అయితే, నవంబర్ నెలలో బంగారం ధర తగ్గే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రూ. లక్ష దిగువకు వచ్చిన తరువాతనే బంగారం కొనుగోళ్లు ఉత్తమమని పేర్కొంటున్నారు.

శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 280 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 250 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఔన్సు గోల్డ్ 4,002 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి రేటు పెరిగింది. కిలో వెండిపై వెయ్యి పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,12,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,23,000కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,23,150కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,12,750కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,23,000కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది.. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,66,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,52,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,66,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
