india Top 10 billionaires :భారత్ లో 10 మంది బిలియనీర్ల సంపదతో దేశంలో పిల్లలందరికీ 25 ఏళ్లు విద్య అందించొచ్చు

10 మంది బిలియనీర్ల సంపదతో దేశంలో చిన్నారులందరికీ 25 ఏళ్లు ఉచిత విద్య అందించొచ్చు

india Top 10 billionaires :భారత్ లో 10 మంది బిలియనీర్ల సంపదతో దేశంలో పిల్లలందరికీ 25 ఏళ్లు విద్య అందించొచ్చు

India Top 10 Billionaires

india Top 10 billionaires : పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు. కానీ శ్రీమంతులు మాత్రం మరింతగా ధనవంతులు అవుతున్నారు. ఆఖరికి కరోనా సమయంలో కూడా శ్రీమంతులు ఏమాత్రం తగ్గేదేలేదు అన్నట్లుగా మరింత ధనవంతులుగా మారారని ఓ సర్వేలో తేలిన నిజం. భారత్ లో ఉన్న బిలియర్ల వద్ద ఉన్న సంపదతో దేశంలోని పిల్లలందరికి 25 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యనందించవచ్చట. అంటే వారి సంపద ఎంతగా భారీగా పెరిగిందో ఊహించుకోవచ్చు. కరోనా సమయంలో నష్టపోయింది ఎక్కువగా మధ్యతరగతివారు.దిగువ మధ్యతరగతివారు. ఇక పేదల సంగతి చెప్పుకోనక్కరలేదు. తినటానికి గుప్పెడు మెతుకులు లేక అల్లాడిపోయారు. ఈనాటికి వారి కష్టాల నుంచి గట్టెక్కటం మాట పక్కన పెడితే కనీసం తేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినవారు ఎంతోమంది.అసలు అప్పులే పుట్టక వీధినపడ్డవారు మరెంతోమంది. ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టాడు. లేనివాడు ఉన్నవాడికే పెట్టాడు అన్న చందంగా ఉంది పరిస్థితి. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా సంపన్నదేశాలు కూడా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడాయి. ఆ నష్టాల నుంచి కోలుకోవటానికి నానా పాట్లు పడతున్నాయి.

కానీ శ్రీమంతులు మాత్రం మరింత డబ్బుని కూడపెడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగానే కాదు భారత్ లో కూడా అటువంటి పరిస్థితే ఉంది. పేదలు మరింత పేదలు అవుతుంటే శ్రీమంతులు మరింత శ్రీమంతులవుతున్నారు. అలా భారత్ లో శ్రీమంతులు వద్ద ఉన్న సంపదతో దేశంలోని పిల్లలను 25 ఏళ్లపాటు చదివించవచ్చని ఆక్స్ ఫామ్ ఇన్ ఈక్వాలిటీ నివేదికలో వెల్లడైంది. కరోనా సమయంలో కూడా  2021లో భారత బిలియనీర్ల సంపద రెట్టింపు కావటం గమనించాల్సిన విషయం.

2020 నాటికి దేశంలో 39 బిలియనీర్లు ఉంటే..వారి సంఖ్య 2021నాటికి మరింతగా పెరిగింది. అంటే 39నుంచి 142కు పెరిగింది. కానీ దేశంలో పేదల గతి మాత్రం మరింతగా దిగజారింది. కరోనా దెబ్బకు పేదలు మరింత దారిద్ర్యరేఖ దిగువుకు దిగజారిపోయిన దుస్థితి ఏర్పడింది. కరోనా దెబ్బకు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్ది చిన్నారులు చదువుకు దూరమైపోయారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.ఇది కేవలం భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నాయి. పేదలు మరింత పేదలవుతుంటే..సంపన్నులు మాత్రం మరింత సంపద కూడబెడుతున్నారు.

Also Read : Covid-19 New Rule : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..నెలకు రూ.8,500 జరిమానా

కానీ సంపన్నుల సంపద మాత్రం పెరుగుతునే ఉందని ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసిన నివేదికల్లో వెల్లడైంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్ వేదికగా నేడు జరగనుంది. ఆన్ లైన్ మాధ్యమంలో దీన్ని నిర్వహిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడనున్నారు. భారత్ లోని టాప్ 10 (వారి సంపాదన విలువ పరంగా చూస్తే) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ స్కూల్ విద్యతో పాటు ఉన్నత విద్య కూడా అందించవచ్చని అదికూడా 25 ఏళ్లపాటు ఉచితంగా విద్య అందించవ్చని..ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది. మహమ్మారి కారణంగా జీవనాధారం దెబ్బతిని భారత్‌లోని 84 శాతం కుటుంబాల ఆదాయం భారీగా తగ్గింది. అదే సమయంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశ సంపదలో 45 శాతం టాప్ 10 బిలియనియర్ల వద్దే ఉంది.

Also Read : New Moon : మన సౌర కుటుంబం పక్కనే మరో చంద్రుడు..భూమికంటే మూడు రెట్లు పెద్దగా

  • దేశ ధనవంతుల లిస్టులు ఫస్ట్ 100 స్థానాల్లో ఉన్న వ్యక్తుల సంపద విలువ 2021లో రూ.57.3 లక్షల కోట్లకు పెరిగింది.

  • భారత్‌లోని తొలి పది మంది ధనవంతుల సంపదతో దేశంలో ఉన్న పిల్లలందరికీ ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యను 25 ఏళ్ల పాటు ఉచితంగా అందించొచ్చు.

  • భారత్ లో టాప్ 100లో 98 మంది సంపద..అట్టడుగు 40 శాతంలో ఉన్న 55.5 కోట్ల మంది పేద ప్రజల సంపదతో సమానం.

  • ధనవంతులు రోజూ రూ.10 లక్షలు ఖర్చు చేస్తే వారి సంపద మొత్తం కరిగిపోవడానికి 84 సంవత్సరాలు పడుతుంది..

  • దేశంలోని బిలియనీర్లు, మల్టీ-మిలియనీర్లపై ఒక శాతం ‘వెల్త్‌ ట్యాక్స్‌’ విధిస్తే ఏటా 78.3 బిలియన్ డాలర్లు వసూలవుతాయి. ఈ డబ్బుతో దేశంలో ఒక్కరు కూడా వైద్యం కోసం సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం రాదు. పైగా 30.5 బిలియన్ డాలర్ల మిగులు కూడా ఉంటుంది.

  • టాప్ లో ఉన్న 98 బిలియనీర్ల సంపదపై కేవలం 4 శాతం పన్ను విధిస్తే ఆ వసూలు అయ్యే డబ్బుతో అంగన్‌వాడీ సేవలు, పోషణ్‌ అభియాన్‌, కిశోర బాలికల అమలు చేసే పథకాలు వంటి ఏకంగా ఓ దశాబ్దకాలం నిర్వహించవచ్చు.

  • సాధారణంగా కేంద్రం ప్రతీ సంవత్సరం ప్రకటించే బడ్జెట్ లో కేటాయించినవన్నీ ఖర్చు చేస్తే దేశంలో విద్యకు, వైద్యానికి కొదువే ఉండదు. కానీ కేటాయింపులకే పరిమితం తప్ప ఖర్చు చేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు 2021-22 బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు సరైన ప్రాధాన్యతే ఇవ్వలేదు. ఆరోగ్య రంగానికి కేటాయించిన నిధులు గత సంవత్సరంతో పోలిస్తే 10 శాతం తగ్గాయి.

  • భారత్‌ అభివృద్ధి చెందింది అని చెప్పుకునే పాలకు దాన్ని కళ్లముందు చూపించే పరిస్థితి లేదనే చెప్పాలి. దీనికి ఉదాహరణగా ఈనాటికి అంటే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోందని చెప్పుకుంటున్న ఈరోజుల్లో కూడా దేశంలో 93 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారంటే ఇక అభివృద్ధి ఎక్కడ? అనిపించకమానదు. అయినా శ్రీమంతుల ఖజానా మాత్రం పెరుగుతునే ఉంది.

  • అసంఘటిత రంగంలో పనిచేసేవారి జీవితాలకు భద్రతే ఉండదు. ఇటువంటివారి సామాజిక భద్రత కోసం తెచ్చామని చెప్పుకునే పథకాలు వారికి ఏమేరకు వర్తిస్తున్నాయి అనేది చాలా పెద్ద ప్రశ్నే. ఇటువంటి వారి కోసం ప్రవేశపెట్టామనే పథకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 2021-22 బడ్జెట్‌ కేటాయింపుల్లో 1.5 శాతం కోత విధించిన పరిస్థితి.

  • ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాన్ని ప్రైవేటుపరం చేసే దిశగా ఉన్న ప్రభుత్వ విధానాలు దేశంలో అసమానతలకు ఆజ్యం పోస్తున్నాయి. తల్లిదండ్రులు తమ కుటుంబ ఆదాయంలో 15 శాతానికిపైగా కేవలం స్కూలు ఫీజుల కోసమే వెచ్చించాల్సి వస్తోంది.