Black Friday Sale : గెట్ రెడీ.. బ్లాక్ ఫ్రైడే సేల్ డేట్ ఇదిగో.. ఈ స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో డీల్స్..!
Black Friday Sale : బ్లాక్ ఫ్రైడే సేల్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైజ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
Black Friday Sale
Black Friday Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. అతి త్వరలో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం కానుంది. దేశంలో ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. భారత మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale) ద్వారా అనేక స్మార్ట్‌ఫోన్లు, ఇతర డివైజ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లను పొందవచ్చు. అనేక బ్రాండ్లు తమ ప్రొడక్టులను అమ్మకానికి అందుబాటులో ఉంచుతాయి. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో సేల్ తేదీ, డీల్స్, ఫోన్‌లపై ఆఫర్లు, డిస్కౌంట్లను ఓసారి పరిశీలిద్దాం..
బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 లాంచ్ తేదీ, డీల్స్ అంచనా :
థాంక్స్ గివింగ్ తర్వాత బ్లాక్ ఫ్రైడే సేల్ రాబోతుంది. ఈ ఏడాదిలో సేల్ నవంబర్ 28న ప్రారంభం కానుంది. భారత మార్కెట్లో ఈ-కామర్స్ దిగ్గజాలు బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ 28, 2025 నుంచి డిసెంబర్ 2, 2025 వరకు సేల్ నిర్వహిస్తాయి.
ఈ డీల్స్ విషయానికొస్తే.. అమెజాన్, ఇతర లోకల్ ఇ-కామర్స్ స్టోర్లు ముఖ్యంగా గేమింగ్ స్టోర్లలో డీల్స్ ఎక్కువగా ఉండొచ్చు. స్టీమ్, ప్లేస్టేషన్ స్టోర్, ఎపిక్ గేమ్స్ స్టోర్ వంటి చాలా గేమింగ్ స్టోర్లు భారీ డిస్కౌంట్లపై గేమ్స్ అందిస్తాయి. ఇతర గాడ్జెట్లపై అసలు ధరపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 : స్మార్ట్‌ఫోన్లు, ఇతర ప్రొడక్టులపై డిస్కౌంట్లు :
నథింగ్, వన్‌ప్లస్, శాంసంగ్ నుంచి కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భారీ ధర తగ్గింపులను పొందవచ్చు. అంతేకాకుండా, ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, సిరీస్ ఎస్, నింటెండో వంటి గేమింగ్ కన్సోల్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. గేమర్‌లు అనేక డిస్కౌంట్లు, గేమింగ్ సంబంధిత అప్లియన్సెస్ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
