Mobile Phones : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ప్రో కన్నా అద్భుతమైన 5 ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి!

Mobile Phones : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ప్రోకు మించిన అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. వివో నుంచి షావోమీ వరకు స్మార్ట్‌ఫోన్లు ఇవే

1/6Mobile Phones
Mobile Phones : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? 2025లో ఐఫోన్ 16 ప్రో కన్నా బెటర్ ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అందులో వివో X200 ప్రో నుంచి ఒప్పో ఫైండ్ X8 ప్రో, శాంసంగ్ S24 అల్ట్రా, వన్‌ప్లస్ 13, షావోమీ 15 అల్ట్రా వంటి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
2/6Vivo X200 Pro
వివో X200 ప్రో (రూ. 70,999) : వివో X200 ప్రో ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో డాల్బీ విజన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ, 90W ఛార్జర్‌తో లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఐఫోన్ 16 ప్రోకు గట్టి పోటీని అందిస్తుంది.
3/6Oppo Find X8 Pro
ఒప్పో ఫైండ్ X8 ప్రో (రూ. 89,999) : 6.78-అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లే, ఒప్పో ఫైండ్ X8 ప్రో, 6x ఆప్టికల్ జూమ్‌ అందించే ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15పై రన్ అయ్యే ఈ ఫ్లాగ్‌షిప్ లెవల్ స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌ కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్రో కన్నా బెటర్ ఫీచర్లు కలిగి ఉంది.
4/6Samsung S24 Ultra
శాంసంగ్ S24 అల్ట్రా (రూ. 83,965) : శాంసంగ్ S24 అల్ట్రా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఆధారితమైన 6.8-అంగుళాల డిస్‌ప్లే, భారీ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 200MP ప్రైమరీ కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్రోకు గట్టిపోటీదారుగా నిలిచింది.
5/6OnePlus 13
వన్‌ప్లస్ 13 (రూ. 89,999) : వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. టాప్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్, భారీ 6000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్రో కన్నా అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
6/6Xiaomi 15 Ultra
షావోమీ 15 అల్ట్రా (99,999) : 6.73-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో షావోమీ 15 అల్ట్రా ఫోన్ 68B కలర్ ఆప్షన్లు కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP క్వాడ్-కెమెరా సెటప్‌ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా పవర్ పొందుతుంది. షావోమీ 15 అల్ట్రా ఫోన్ భారీ 5410mAh బ్యాటరీతో ప్రీమియం-లెవల్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు.