Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు అనేక దేశాలపై సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మన దేశంపై 26 శాతం సుంకాలు విధించారు. దీంతో మన మనదేశలో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. అలాగే, పలు వస్తువుల ధరలు తగ్గుతాయి.
మనదేశం నుంచి అమెరికాకు అధికంగా పసిడి, వెండి, వజ్రాలు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ ఇప్పుడు ఈ రంగంపై 13.32 % టారిఫ్ విధిస్తున్నారు. దీంతో దేశంలో నగలతో పాటు ఆభరణాల ధరలు తగ్గనున్నాయి.
ఇదే సమయంలో అమెరికాలో వీటి ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అమెరికాకు భారత్ నుంచి వీటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఆయా రంగాల చేతివృత్తిదారులతో పాటు వ్యాపారులపై పడే అవకాశం ఉంది.
అమెరికాకు భారత్ మొబైల్‌తో పాటు టెలికాం, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కూడా ఎగుమతి చేస్తుంది. వాటిపై ట్రంప్ 7.24 % టారిఫ్ విధించారు. ఈ కారణంతో అక్కడ ఐఫోన్ సహా పలు మొబైల్ ఫోన్ల ధరలు పెరుగుతాయి. మన దేశంలోనూ అనేక స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతాయి.
అమెరికాకు భారత్ నుంచి కోట్లాది రూపాయల వస్త్రాలు ఎగుమతి అవుతాయి. వీటిపై ట్రంప్ భారీగా ట్యాక్స్ విధిస్తున్నారు. పరస్పర టారిఫ్‌లతో అమెరికాలో వాటి ధరలు తగ్గుతాయి.
అమెరికాకు భారత్ నుంచి కొన్ని కోట్ల రూపాయల సముద్ర ఆహారం ఎగుమతి అవుతుంది. దీనిపై కూడా ట్రంప్ 27.83 % టారిఫ్ అమలు చేసే అవకాశం ఉంది. దీంతో యూఎస్‌లో రొయ్యల ధర పెరుగుతుంది. భారత్ నుంచి వాటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో మన దేశంలో రొయ్యల ధరలు తగ్గుతాయి. అయితే, రొయ్యల వ్యాపారంలో ఉన్న వారి ఆదాయం తగ్గుతుంది.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పంచదార, ప్రాసెస్ చేసిన ఫుడ్, కోకోపై అమెరికాలో 24.99 % టారిఫ్ వేసే ఛాన్స్ ఉంది. యూఎస్‌లో మన దేశ మిఠాయిలు, తినుభండారాల ధరలు పెరుగుతాయి. అలాగే, నెయ్యితో పాటు పాల పొడి, వెన్న ధరలు భారత్‌లో తగ్గుతాయి.
అమెరికాలో వంట నూనె సెక్టార్‌పై 10.67 % టారిఫ్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఆ రంగంలోని రైతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. దేశంలో ఆవాలతో పాటు కొబ్బరి రేట్ తగ్గుతుంది. మరోవైపు, మన దేశంలో బాదంతో పాటు వాల్ నట్స్ వంటి వాటి రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది.