Summer Tour: సమ్మర్ టూర్ కు వెళ్తున్నారా.. రైల్వే శాఖ స్పెషల్ ప్యాకేజీలు ఇవే.. ధరలు, పర్యాటక ప్రదేశాల వివరాలు ఇలా

దేశంలోని పలు ప్రదేశాలకు సమ్మర్ టూర్ ప్యాకేజీలను రైల్వే శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బయలుదేరే సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ రైలుకు సంబంధించి నాలుగు ప్యాకేజీల వివరాలను వెల్లడించింది.

Summer Tour: సమ్మర్ టూర్ కు వెళ్తున్నారా.. రైల్వే శాఖ స్పెషల్ ప్యాకేజీలు ఇవే.. ధరలు, పర్యాటక ప్రదేశాల వివరాలు ఇలా

Indian Railway special Packages

Updated On : April 3, 2025 / 2:20 PM IST

Summer Tour Indian Railway special Packages: వేసవికాలం వచ్చిందంటే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాలను, పుణ్యక్షేత్రాలను ఎంపిక చేసుకొని వెళ్తుంటారు. ఇలాంటి వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన పలు సంస్థలు స్పెషల్ ప్యాకేజీలతో టూర్లకు తీసుకెళ్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా.. రైల్వే శాఖకూడా సమ్మర్ టూర్ కు వెళ్లే వారికి స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది.

Also Read: Gold Rate Today: ట్రంప్ సుంకాల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. హైదరాబాద్‌లో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే..?

దేశంలోని పలు ప్రాంతాలకు సమ్మర్ టూర్ ప్యాకేజీలను రైల్వే శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బయలుదేరే సమ్మర్ స్పెషల్ భారత్ గౌరవ్ రైలుకు సంబంధించి నాలుగు ప్యాకేజీల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది.

Indian Railway

Indian Railway

ప్యాకేజీ-1 కింద హరిద్వార్, రిషికేశ్, వైష్ణోదేవిని సందర్శించవచ్చు. దీని విలువ రూ.18,510గా నిర్ణయించింది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు.. అంటే పది రోజుల పాటు టూర్ సాగనుంది. ఇందులో హరిద్వార్, రిషికేశ్, ఆనందపూర్, నైనా దేవి, అమృతసర్, మాతా వైష్ణోదేవి దేవాలయాలు కవర్ కానున్నాయి.

ప్యాకేజీ-2 కింద కాశీ, గయా, ప్రయాగ, అయోధ్య వెళ్లొచ్చు. మే8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సాగే ఈ టూర్ ప్యాకేజీ విలువ రూ.16,800గా రైల్వే శాఖ నిర్ణయించింది.

ప్యాకేజీ -3 కింద అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు ప్రదేశాలు కవర్ కానున్నాయి. మే 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ యాత్ర సాగుతుంది. ఇందుకోసం రైల్వేశాఖ రూ.14,700గా నిర్ణయించింది.

ప్యాకేజీ -4 కింద పంచ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీంశంకర్, గృష్ణేశ్వర్, ఎల్లోరా మోవ్, నాగ్ పూర్ ప్రదేశాలు కవర్ అవుతాయి. జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు ఈ యాత్ర సాగుతుంది. ఇందుకు గాను ప్యాకేజీని రైల్వే శాఖ రూ.14,700గా నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు 040 27702407, 9701360701, 9281495845, 9281495843, 9281030750, 9281030740 నంబర్లను సంప్రదించాలని రైల్వే శాఖ సూచించింది. ఆన్ లైన్ బుకింగ్ కోసం www. irctctourism.comను సంప్రదించాలని కోరింది.