×
Ad

Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఇలా పెట్టుబడి పెట్టారంటే.. ప్రతి నెలా రూ. 10వేలకు పైగా సంపాదించుకోవచ్చు..!

Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? ఇలా పెట్టుబడి పెట్టారంటే ప్రతి నెలా రూ. 10వేలు కన్నా ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు.

Post Office Scheme

Post Office Scheme : పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. పోస్టాఫీసులో అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి. బాగా పాపులర్ అయిన సేఫ్ సేవింగ్స్ స్కీమ్. పెట్టుబడిదారులకు స్థిరమైన గ్యారెంటీ రాబడిని అందిస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గుదలతో దాదాపు ఎలాంటి రిస్క్ ఉండదు.

ఈ పోస్టాఫీసు పథకం ప్రస్తుత వార్షిక (Post Office Scheme) వడ్డీ రేటు 7.40శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీలను సమీక్షిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడికి పెట్టేవాళ్లు భారతీయ పౌరుడై ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకంతో పాటు మీరు ఒకసారి డబ్బు డిపాజిట్ చేసి నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు.

పెట్టుబడి పరిమితి ఎంతంటే? :
మీరు కేవలం రూ.100 డిపాజిట్ చేయడం ద్వారా POMIS అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆపై రూ. 1000 చొప్పున పెట్టుబడి పెట్టవచ్చు. ఒకే అకౌంటుకు గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.9 లక్షలు. జాయింట్ అకౌంటులో గరిష్ట పరిమితి రూ.15 లక్షలు. ఇద్దరు కుటుంబ సభ్యులు కలిసి పెట్టుబడి పెట్టుకోవచ్చు.

Read Also : Vivo Y19 5G Price : ఇది కదా డిస్కౌంట్.. వివో Y19 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే?

వడ్డీ రేటు, కాలపరిమితి :
ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.40శాతం. అకౌంట్ ఓపెన్ చేసిన నెల తర్వాత వడ్డీ నెలవారీగా చెల్లిస్తారు. ఈ పథకం సాధారణ కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది.

పన్ను, నామినీ బెనిఫిట్స్ :
మీరు సంపాదించే నెలవారీ వడ్డీపై పన్ను ఉంటుంది. నామినీని కూడా యాడ్ చేసుకోవచ్చు. తద్వారా మీరు మరణిస్తే నామినీ పెట్టుబడి, వడ్డీని పొందవచ్చు. జాయింట్ అకౌంటుతో సంవత్సరానికి 7.40శాతం వడ్డీతో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే వారికి ఏడాదికి దాదాపు రూ. 1,11,000 లేదా నెలకు రూ. 9,250 లభిస్తుంది. ఈ డబ్బు నేరుగా బ్యాంకు అకౌంటులో జమ అవుతుంది. రిటైర్మెంట్ అయ్యేవారికి గృహిణులకు లేదా సురక్షితమైన ఆదాయాన్ని కోరుకునే ఎవరికైనా అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

POMIS ఎందుకు బెటర్ అంటే? :

  • మార్కెట్ మార్పుల వల్ల ప్రభావితం కాదు. గ్యారెంటీ రాబడి వస్తుంది.
  • రెగ్యులర్ నెలవారీ ఆదాయం పొందవచ్చు. అంటే ప్రతి నెలా డబ్బు వస్తుంది.
  • మీ పెట్టుబడి సురక్షితంగా ఉండేందుకు నామినీ సౌకర్యం కూడా ఉంది.
  • ఏ పోస్టాఫీసులోనైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

పరిమితులివే :
ముందస్తుగా విత్‌డ్రా చేసుకుంటే జరిమానా చెల్లించాలి. వడ్డీపై పన్ను కూడా పొందవచ్చు. అయితే, కనీస మొత్తాన్ని మెచ్యూరిటీ తర్వాత విత్‌డ్రా చేసుకోవాలి. తిరిగి పెట్టుబడి పెట్టాలి. పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం అనేది క్రమం తప్పకుండా ఆదాయం పొందడానికి సురక్షితమైన మార్గంగా చెప్పవచ్చు.