Ather EV Scooter Prices
Ather EV Scooter Prices : 2026 కొత్త సంవత్సరంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? కొంటే ఇప్పుడే కొనేసుకోండి. వచ్చే ఏడాది నుంచి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడు అయితే తగ్గింపు ధరకే ఏథర్ స్కూటర్లను కొనేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో టీవీఎస్ బజాజ్ తర్వాత రెండో అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయదారు ఏథర్ ఎనర్జీ జనవరి 1, 2026 నుంచి ధరలను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఏథర్ అన్ని ఈవీ స్కూటర్ మోడళ్లకు (Ather EV Scooter Prices) ధరలు పెరగనున్నాయి. ఏథర్ ఎనర్జీ స్కూటర్ల ధరలను రూ. 3వేల వరకు పెరగనున్నాయి. ప్రస్తుతం, ఏథర్ ఎనర్జీ అత్యధికంగా రిజ్టా ఫ్యామిలీ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో 450S, 450X, 450 Apex వంటి మోడళ్లు కూడా అమ్ముడవుతున్నాయి.
ధరల పెరుగదలకు కారణాలివే :
ముడి పదార్థాలు, విదేశీ మారకం, అవసరమైన ఎలక్ట్రానిక్ భాగాలకు ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరగడమే ఏథర్ ఈవీ స్కూటర్ల పెరుగుదలకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఈ నెలలో ఏథర్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఎలక్ట్రిక్ డిసెంబర్ ఆఫర్ అద్భుతమైన అవకాశం.
రూ. 20వేల వరకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇన్‌స్టంట్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ డిస్కౌంట్లు, క్యాష్ ప్రోత్సాహకాలు ఎంపిక చేసిన మోడళ్లపై 8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ ఉన్నాయి. అనేక మంది ఫైనాన్సర్ల నుంచి ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
దేశంలో రిజ్టా ఆధిపత్యం :
ఏథర్ రిజ్టా అనేది మొట్టమొదటి ఫ్యామిలీ స్కూటర్. దేశవ్యాప్తంగా బాగా అమ్ముడవుతోంది. ఇటీవలే 2లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. ఏథర్ దేశవ్యాప్తంగా రిటైల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో రిజ్టా కీలక పాత్ర పోషించింది.
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకంగా రైడర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. 56 లీటర్ల స్టోరేజీ స్పేస్, విశాలమైన సీటు, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్ స్పేస్ కలిగి ఉంది. అలాగే స్కిడ్ కంట్రోల్, ఫాల్ సేఫ్టీ, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ థెఫ్ట్ టో అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఏథర్ 450 సిరీస్ స్కూటర్లు అద్భుతమైన డిజైన్, అడ్వాన్స్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ఏథర్ ఈవీ స్కూటర్ల ధరలివే :
ఏథర్ రిజ్టా మోడల్ ధర : రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.61 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ఏథర్ 450S మోడల్ ధర : రూ. 1.28 లక్షల నుంచి రూ. 1.53 లక్షలు, ఎక్స్-షోరూమ్
ఏథర్ 450X ధర రూ. 1.55 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్)
ఏథర్ 450 అపెక్స్ ధర రూ. 1.90 లక్షల నుంచి అన్ని ధరలు (ఎక్స్-షోరూమ్)