Elon Musk confirms date when all legacy accounts will lose blue tick, only paid users will be verified
Twitter Blue Tick : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ దిగ్గజం ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తమ ప్లాట్‌ఫారమ్ నుంచి లెగసీ బ్లూ టిక్ (legacy accounts)లను తొలగించేందుకు లాస్ట్ డేట్ ప్రకటించారు. ఈ తేదీలోగా ఎవరైతే తమ అకౌంట్లో బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ చెల్లించరో వారి అకౌంట్ బ్లూ టిక్ కోల్పోవాల్సి వస్తుంది. ఇంతకీ మస్క్ సెట్ చేసిన లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా? ఏప్రిల్ 20 (4/20).. అంటే.. ఈ తేదీ వెనుక పెద్ద కథే ఉంది.
అసలు మస్క్ ఎందుకు ఈ తేదీనే ఎంచుకున్నాడో తెలిస్తే అందరూ షాకవుతారు. ఈ తేదీ తర్వాత ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ని పొందుతారు. మస్క్ అభిప్రాయం ప్రకారం.. ఈ తేదీ తర్వాత బ్లూ టిక్ లేని లెగసీ అకౌంట్లన్నీ 4/20 అకౌంట్లుగా ట్విట్టర్ పరిగణిస్తుందని అర్థం కావొచ్చు.
గత ఏడాది చివరిలో ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటి నుంచి రూ. 650 (Web)కు ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫై చేసుకోవాలని యూజర్లపై మస్క్ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని యూజర్లు వెరిఫికేషన్ కోసం సాధారణ మెథడ్‌కు యాక్సస్ పొందవచ్చునని మస్క్ అభిప్రాయపడ్డారు. తద్వారా ట్విట్టర్ అకౌంట్ అథెంటికేషన్ కలిగి ఉందని సూచిస్తుంది. ఇంతకు ముందు, లెగసీ వెరిఫై చేసిన బ్యాడ్జ్‌లు లేదా బ్లూ టిక్‌లను తొలగించడానికి మస్క్ ఏప్రిల్ 1 లాస్ట్ డేట్‌గా నిర్ణయించారు.
చాలా తక్కువ అకౌంట్లు మాత్రమే తమ బ్యాడ్జ్‌లను కోల్పోయాయి. మిగిలిన వెరిఫై చేసుకున్న యూజర్లు తమ ప్రొఫైల్‌లలో బ్లూ టిక్‌ను అలాగే కలిగి ఉన్నారు. లెగసీ ట్విట్టర్ అకౌంట్ వినియోగదారులకు మరో అవకాశం ఇస్తున్నట్టు మస్క్ తెలిపారు. అందులో భాగంగానే లెగసీ బ్లూ టిక్ వెరిఫికేషన్ చివరి తేదీని (4/20)గా నిర్ణయించినట్టు మస్క్ వెల్లడించారు.
Final date for removing legacy Blue checks is 4/20
— Elon Musk (@elonmusk) April 11, 2023
4/20 తేదీనే ఎందుకు ఎంచుకున్నాడంటే? :
వాస్తవానికి (4/20) అనేది స్మగ్లింగ్ వంటి నేరాలకు పాల్పడేవారిని పిలుస్తుంటారు. జో రోగన్ పోడ్‌కాస్ట్‌లో మాదకద్రవ్యాన్ని సేవించే ఫొటో వైరల్ అయిన తర్వాత మస్క్ గతంలో 4:20 గురించి పలుమార్లు జోకులు కూడా పేల్చాడు. గత ఏడాది ఏప్రిల్‌లో మస్క్ ఒక్కో షేరుకు 54.20 డాలర్లు నగదు రూపంలో ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేశాడు.
Twitter blue Tick : Elon Musk confirms date when all legacy accounts will lose blue tick, only paid users will be verified
బహుశా, టెస్లా ఒక్కో షేరుకు 420 డాలర్లు చొప్పున ప్రైవేట్‌గా కొనుగోలు చేయొచ్చునని 2018లో ప్రతిపాదించాడు. ఈ ట్వీట్ కారణంగా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించినట్టు అయింది. దాంతో వాటాదారుల నుంచి మస్క్‌పై దావాకు దారితీసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని కోర్టు.. టెస్లా షేర్లపై మస్క్ తన ట్వీట్లతో పెట్టుబడిదారులను మోసం చేయలేదని తీర్పు చెప్పింది. ఇంతలో, లెగసీ బ్లూ టిక్‌లను కలిగిన ట్విట్టర్ యూజర్లు తమ వెరిఫైడ్ స్టేటస్ కొనసాగించాలంటే.. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తప్పక పొందాలని మస్క్ స్పష్టం చేశారు.
బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ల ధర మార్కెట్‌ను బట్టి మారుతుంది. భారత మార్కెట్లో ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్ వెబ్ (Twitter Web)లో నెలకు రూ. 650 చెల్లించాలి. ట్విట్టర్ యూజర్లు సాపేక్షంగా తక్కువ ఖర్చుతో కూడిన వార్షిక చందా పొందవచ్చు. వెరిఫైడ్ బ్యాడ్జ్ కాకుండా, యూజర్లు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌తో కొన్ని ఫీచర్‌లను పొందవచ్చు. ట్విట్టర్ బ్లూ యూజర్లను దీర్ఘకాల ట్వీట్లను పోస్ట్ చేసేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.
అంతేకాదు.. Undo/Edit చేసే ఆప్షన్ కూడా అందిస్తుంది. ట్విట్టర్ బ్లూ యూజర్లు ఈ కొత్త ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం యూజర్లు నిర్దిష్ట ప్రమాణాలను ఎంచుకోవాలి. ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ పొందాలంటే 30 రోజుల పాటు సైన్ అప్ చేయలేరు. యాక్టివ్ లేని అకౌంట్లు (గత 30 రోజులుగా) లేదా మునుపటి మూడు రోజులలో వారి ప్రొఫైల్ ఫొటో, పేరు లేదా యూజర్ నేమ్ మార్చినవి కూడా సైన్ అప్ చేయలేకపోవచ్చు. సబ్ స్ర్కైబర్లు వెరిఫై అయి ఫోన్ నంబర్ కూడా తప్పక కలిగి ఉండాలి.