Elon Musk: అయ్యో.. ఎలాన్ మస్క్ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారో తెలుసా? కారణాలివే..

ఎలాన్‌ మస్క్ ఇంతగా సంపదను కోల్పోయినప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో అగ్ర స్థానంలోనే ఉన్నారు.

Elon Musk

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొన్ని వారాల్లోనే తన నికర విలువలో సుమారు రూ.10 లక్షల కోట్ల (120 బిలియన్ డాలర్ల)ను కోల్పోయారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆయన సంపదలో 25 శాతం తగ్గుదల కనపడింది. టెస్లా స్టాక్ రేట్‌, బినిజెస్ పరంగా ఎదురవుతున్న సవాళ్లు, మార్కెట్ పరిస్థితుల వల్ల ఆయన సంపద ఆవిరైపోయినట్లు తెలుస్తోంది.

ఎలాన్‌ మస్క్ ఇంతగా సంపదను కోల్పోయినప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో అగ్ర స్థానంలోనే ఉన్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ కొనసాగుతున్నారు.

Also Read: అందుకే పిల్లలను చంపేసి దంపతుల బలవన్మరణం.. రెండు సూసైడ్ ​నోట్లు లభ్యం..

ఈ ఏడాది మొదటి నుంచి ఎలాన్ మస్క్ సంపద తగ్గడానికి ముఖ్య కారణం టెస్లా స్టాక్‌ ధరేనని చెప్పుకోవచ్చు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు మరీ అంతగా జరగడం లేదు. ఆ కార్ల విక్రయాలు 2024 డిసెంబర్‌తో పోల్చుకుంటే 2025 జనవరి నాటికి 16 శాతం వరకు తగ్గాయి.

టెస్లా షేర్ ధర సుమారు 35 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. దీంతో మార్కెట్లో టెస్లా గట్టి పోటీని ఎదుర్కొంటోంది. మస్క్ సంపద తగ్గడానికి ఆయన రాజకీయ ప్రమేయం పెరగడం కూడా మరో కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మస్క్ ఇప్పుడు టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌కు సీఈవోగా ఉండడంతో పాటు అమెరికా ప్రభుత్వంలో సీనియర్ సలహాదారుడిగానూ ఉన్నారు. డోజ్‌కు చీఫ్‌గా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఆయన ప్రమేయం పెరగడంతో కొంతమంది పెట్టుబడిదారుల్లో భయం మొదలైంది. దీంతో కూడా టెస్లా షేర్స్ తగ్గుతున్నట్లు తెలుస్తోంది.