అందుకే పిల్లలను చంపేసి దంపతుల బలవన్మరణం.. రెండు సూసైడ్ ​నోట్లు లభ్యం..

వారి కుటుంబం హబ్సిగూడ పరిధిలోని రవీంద్రనగర్‌‌‌‌లో రెంట్‌కు ఉంటోంది.

అందుకే పిల్లలను చంపేసి దంపతుల బలవన్మరణం.. రెండు సూసైడ్ ​నోట్లు లభ్యం..

Updated On : March 11, 2025 / 11:50 AM IST

జాబ్ మానేసి ఆరు నెలలు అవుతోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. అందులో నుంచి బయటపడే మార్గం కనపడలేదు. దీంతో భార్యతో కలిసి ఇద్దరు పిల్లలను చంపేశాడు ఓ వ్యక్తి. అనంతరం భార్యతో కలిసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

చంద్రశేఖర్ ​రెడ్డి(44) అనే వ్యక్తి కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య కవిత(35), కూతురు శ్రీతారెడ్డి(13), కుమారుడు విశ్వంత్ రెడ్డి(10) ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి ఎనిమిది నెలల కింద కుటుంబంతో కలిసి హైదరాబాద్‌‌కు వచ్చారు. వారి కుటుంబం హబ్సిగూడ పరిధిలోని రవీంద్రనగర్‌‌‌‌లో రెంట్‌కు ఉంటోంది.

Also Read: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ ఆ రోజున వస్తారు.. ప్రస్తుతం ఏం జరుగుతోంది?

చంద్రశేఖర్‌ రెడ్డి కూతురు శ్రీతారెడ్డి తొమ్మిదో తరగతి, కుమారుడు విశ్వంత్ రెడ్డి ఐదో తరగతి చదువుతున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఓ ప్రైవేట్ ఇంటర్‌​ కాలేజీలో ​లెక్చరర్‌‌‌‌గా పనిచేశారు. 6 నెలల కింద ఉద్యోగం మానేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. చంద్రశేఖర్, విశ్వంత్‌ రెడ్డి ఇద్దరూ కలిసి బలవన్మరణానికి పాల్పడాలని భావించారు.

తాము లేకపోతే పిల్లలు మరిన్ని సమస్యలకు గురి కావాల్సి వస్తుందని కుమార్తెకు విషమిచ్చి, కుమారుడికి ఉరి వేసి చంపేశారు. అనంతరం వేర్వేరు గదుల్లోకి వెళ్లి చంద్రశేఖర్, కవిత కూడా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు సూసైడ్ ​నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఆర్థిక సమస్యలే కారణమని ఆ దంపతులు అందులో రాశారు.