Elon Musk
Elon Musk’s Net Worth : ట్రంప్ టారిఫ్స్ ఎలన్ మస్క్‌ను కూడా తీవ్రదిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రముఖ టెస్లా కంపెనీ సీఈఓ, డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు ఎలస్ మస్క్ నికర విలువ నవంబర్ 2024 తర్వాత మొదటిసారిగా 300 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది.
అయితే, అమెరికా అధ్యక్షుడు అనేక దేశాలపై సుంకాలు విధించారు. ఈ సుంకాల విధింపుతో ట్రంప్ అత్యంత సన్నిహితులపై కూడా తీవ్ర ప్రభావం పడింది. అమెరికాతో సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల ట్రిలియన్ డాలర్ల విలువైన సంపద ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ మార్కెట్ క్షీణత మధ్య టెస్లా షేర్లు పతనంతో ఎలన్ మస్క్ 4.4 బిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.38వేలు కోట్లు నష్టపోయారు. గత వారం ట్రంప్ సుంకాలను ప్రకటించిన తర్వాత మస్క్ సంపద 31 బిలియన్ డాలర్లు తగ్గింది.
దాంతో మస్క్ మొత్తం సంపద 297.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2025లో మస్క్ దాదాపు 134.7 బిలియన్ డాలర్లకు తగ్గనుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదికలో ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాలో మస్క్ 6వ స్థానంలో నిలిచాడు.
మొత్తంమీద, ఇండెక్స్ 271 బిలియన్ డాలర్లు పడిపోయింది. అమెరికా ఉత్పత్తులపై చైనా 34శాతం ప్రతీకార సుంకాలను విధించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికా ఆర్థిక మాంద్యం భయాలను పెంచింది. ప్రపంచ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది.
Read Also : Top Budget Phones : ఫీచర్ ఫోన్లు అదుర్స్.. రూ. 5వేల లోపు ధరలో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. ఇప్పుడే కొనేసుకోండి!
సుంకాలను వెనక్కి తీసుకోండి.. ట్రంప్‌కు మస్క్ విజ్ఞప్తి :
నివేదికల ప్రకారం.. టెస్లా సీఈఓ ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE) అధిపతి ఎలన్ మస్క్ వ్యక్తిగతంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కొత్త సుంకాలను ఉపసంహరించుకోవాలని కోరారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50 శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తర్వాత మస్క్ బహిరంగంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేశాడు.
అయితే, ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడిని నేరుగా మస్క్ కోరినట్టు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. చైనా వస్తువులపై 50 శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.