Insurance claims: ఏయే వ్యాధులకు అత్యధికంగా ఇన్సురెన్స్‌ క్లెయిమ్స్ చేసుకుంటున్నామో తెలుసా?

శ్వాసకోశ వ్యాధి మూడవ స్థానంలో ఉంది. అలాగే, భారత్‌లో ఉద్యోగులకు వారి కంపెనీలు ఇచ్చే ఇన్సురెన్స్ ప్రీమియం 11 శాతం మేర పెరగనుందని..

Insurance claims

Claims frequency: ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఇన్సురెన్స్‌ల మధ్య అవగాహన పెరుగుతోంది. అనుకోని ఉపద్రవంలా వచ్చిపడే తీవ్ర అనారోగ్య సమస్యలు తమను ఆర్థిక ఇబ్బందుల్లో పడేయకుండా చాలా మంది హెల్త్ ఇన్సురెన్స్ తీసుకుంటున్నారు. కంపెనీలు తమ ఉద్యోగులకు బీమాను తప్పనిసరి చేశాయి.

ప్రజలు ఏయే వ్యాధులకు ఇన్సురెన్స్ సదుపాయాన్ని బాగా వాడుకున్నారన్న వివరాలను మెర్సర్ మార్ష్ బెనిఫిట్స్-మెర్సర్ మార్ష్ హెల్త్ ట్రెండ్స్ రిపోర్ట్-2024లో పేర్కొన్నారు. భారత్ సహా ఆసియాలోని దేశాలపై సర్వే చేసి ఈ నివేదికను వెల్లడించారు. క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులకు అత్యధికంగా క్లెయిమ్స్ వచ్చాయి.

ఈ రెండు వ్యాధులు మొదటి రెండు స్థానాల్లో ఉంటే.. శ్వాసకోశ వ్యాధి మూడవ స్థానంలో ఉంది. అలాగే, భారత్‌లో ఉద్యోగులకు వారి కంపెనీలు ఇచ్చే ఇన్సురెన్స్ ప్రీమియం 11 శాతం మేర పెరగనున్నాయని మెర్సర్ మార్ష్ బెనిఫిట్స్ మెర్సర్ మార్ష్ హెల్త్ ట్రెండ్స్ రిపోర్ట్-2024లో పేర్కొన్నారు. 2023లో 9.6 శాతం మేర బీమా ధరలు పెరిగాయి.

Gold Prediction 2024: గోల్డ్ కొంటున్నారా? 2024లోనూ బంగారం ధర ఆ స్థాయిలో పెరుగుతుందా? సర్వేలో ఏం తేలింది?