EPF Life Insurance : సూపర్ స్కీమ్.. మీకు PF ఖాతా ఉందా? ఫ్రీగా రూ.7 లక్షల జీవిత బీమా! ఎలాగంటే?
EPF Life Insurance : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. ఇకపై ఉచితంగా రూ. 7 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.. అది ఎలాగంటే?
EPF Life Insurance
- పీఎఫ్ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు
- EDLI స్కీమ్ కింద నామినీకి ఒకేసారి ఫుల్ పేమెంట్
- ఉద్యోగి సర్వీసులో మరణిస్తే కనీసం రూ.2.5 లక్షల వరకు హామీ
EPF Life Insurance : ఈపీఎఫ్ సభ్యులకు గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ సభ్యులందరికి ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఉద్యోగి రూ.7 లక్షల వరకు ఫ్రీగా లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందవచ్చు.
ఈ మేరకు ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ కింద ఈ బెనిఫిట్ పొందవచ్చు. పీఎఫ్ పొందే ఉద్యోగులు అదనంగా పైసా కూడా ప్రీమియంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.
రూ.2.5 లక్షలు కాదు.. రూ. 7 లక్షల వరకు :
పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణం సంభవిస్తే.. నామినీ లేదా చట్టపరమైన వారసులకు బీమా మొత్తం ఒకేసారి చెల్లిస్తారు. వాస్తవానికి,
ఈ స్కీమ్ ప్రీమియంను కంపెనీనే భరిస్తుంది. అందులో ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలో 0.5శాతంగా ఉంటుంది. కనీస ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. రూ.2.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు పొందవచ్చు.
Read Also : WWDC 2026 Siri AI : వావ్.. ఆపిల్ సిరి ఇప్పుడు సిరి AI.. ఇకపై చదవగలదు.. మనిషిలా మాట్లాడగలదు.. అంతా ఒకేచోట!
30 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్మెంట్ :
ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఫాస్ట్ పూర్తి అవ్వాలంటే పీఎఫ్ సభ్యులు నామినీ వివరాలను మెంబర్ పోర్టల్లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. ముఖ్యంగా పెళ్లి, పిల్లలు పుట్టడం వంటి నామినీ వివరాలను తప్పనిసరిగా మార్చుకోవడం ఎంతైనా మంచిది. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పిస్తే కేవలం 20 నుంచి 30 రోజుల్లోనే మీ పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ అవుతుంది.
ఏడాదిలోగా మరణిస్తే రూ. 50వేలు హామీ :
ఒకవేళ ఏదైనా కంపెనీలో చేరిన ఏడాదిలోపే ఆ ఉద్యోగి మరణిస్తే కనీసం రూ.50వేలు గ్యారెంటీ ఉంటుంది. ఒక జాబ్ నుంచి మరో జాబ్ మారిన సమయంలో కూడా ఈపీఎఫ్ అకౌంట్ యాక్టివ్గా ఉన్నా ఇన్సూరెన్స్ కవరేజీ అలానే కొనసాగుతుంది.
ఈ ఫారం తప్పనిసరి :
పీఎఫ్ క్లెయిమ్ కోసం చూస్తుంటే నామినీ గానీ లేదంటే గార్డియన్లు ఫారం 5 IFతో అప్లయ్ చేయాలి. అలాగే డెత్ సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా వివరాలను కూడా ఇవ్వాలి. రిటైర్మెంట్ సేవింగ్స్ ద్వారా ఎలాంటి అదనపు బెనిఫిట్స్ ఉంటాయో ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు అవగాహన ఉండాలి.
