EPFO 3 0 Rollout
EPFO 3.0 Rollout : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అతి త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ EPFO 3.0 ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 8 కోట్లకు పైగా సభ్యులకు ప్రావిడెంట్ ఫండ్ సేవలను పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ ముందుగా గత జూన్‌లోనే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక పరీక్షల కారణంగా ఆలస్యం అయింది. అధికారుల ప్రకారం.. చివరి రౌండ్ ఎంపిక కోసం ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ మేజర్లను షార్ట్‌లిస్ట్ చేసింది.
ఈపీఎఫ్ఓ 3.0 సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ఇకపై చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అవసరమైన సమయాల్లో వేగవంతంగా ఫండ్స్ పొందవచ్చు. వాస్తవానికి, ఈ ప్లాట్‌ఫామ్ జూన్ 2025లో ప్రారంభం అవుతుందని భావించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలు, టెస్టింగ్ కారణంగా ఆలస్యం అయింది. అయినప్పటికీ, EPFO 3.0 అనేక మంది పీఎఫ్ ఖాతాదారులకు అనేక ప్రయోజనాలను అందించనుంది. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
ఈపీఎఫ్ఓ 5 పెద్ద ప్రయోజనాలివే :
ఏటీఎంలలో నేరుగా PF డబ్బులు విత్‌డ్రా :
పీఎఫ్ సభ్యులు తమ బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయొచ్చు. తద్వారా ఏటీఎంల నుంచి నేరుగా ప్రావిడెంట్ ఫండ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
యూపీఐతో ఇన్‌స్టంట్ విత్‌డ్రా :
ఈపీఎఫ్ఓ 3.0 సభ్యులు యూపీఐ ఇన్‌స్టంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో పీఎఫ్ ఫండ్స్ సులభంగా పొందవచ్చు.
ఆన్‌లైన్ క్లెయిమ్, దిద్దుబాటు :
ఉద్యోగులు OTP అథెంటికేషన్ ఉపయోగించి వ్యక్తిగత వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు. నేరుగా ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
డెత్ క్లెయిమ్ వేగవంతం :
మైనర్ల విషయంలో గార్డియన్‌షిప్ సర్టిఫికెట్ల అవసరం ఉండదు. తద్వారా ఈపీఎఫ్ఓ ప్రక్రియ సులభతరం అవుతుంది. తద్వారా కుటుంబాలకు వేగంగా ఆర్థిక సాయం అందుతుంది.
మెరుగైన డిజిటల్ ఇంటర్‌ఫేస్ :
అప్‌గ్రేడ్ ప్లాట్‌ఫామ్ మరింత యూజర్ ఫ్రెండ్లీ డాష్‌బోర్డ్‌తో రానుంది. పీఎఫ్ సభ్యులు కాంట్రిబ్యూషన్లు, క్లెయిమ్‌లు, ఇతర బ్యాలెన్స్‌లను ట్రాక్ చేయొచ్చు.
ఇతర సంస్కరణలివే :
కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వ్యక్తిగత వివరాల దిద్దుబాట్లు
ఉద్యోగ మార్పుపై పీఎఫ్ బదిలీ, ఖాతాల పోర్టబిలిటీని వేగవంతం చేయడం.
ఆలస్యమైనా ఈపీఎఫ్ఓ 3.0 ఒకసారి అమల్లోకి వస్తే.. ఈ ప్లాట్‌ఫామ్ పేపర్ వర్క్ తగ్గిస్తుంది. లావాదేవీలను వేగవంతం చేస్తుంది. ఉద్యోగులకు ప్రత్యక్ష ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది.