EPFO 3.0 Launch : ఉద్యోగులకు పండగే.. EPFO 3.0 కొత్త వెర్షన్ బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఇకపై అన్ని క్షణాల్లోనే..!

EPFO 3.0 Launch : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPFO ​​3.0 వెర్షన్ ప్రారంభించనుంది. PF నుంచి డబ్బును విత్ డ్రా చేయడంతో పాటు డేటాను అప్‌డేట్ చేసుకోవడం వంటి అన్ని పనులు క్షణాల్లో పూర్తి అవుతాయి.

EPFO 3 0 Launch

EPFO 3.0 Launch : కోట్లాది మంది ఉద్యోగులు, పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ (EPFO) 3.0 కొత్త వెర్షన్ వచ్చేస్తోంది.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అతి త్వరలో EPFO ​​3.0 వెర్షన్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ కొత్త వెర్షన్ సేవలు అందుబాటులోకి వస్తే.. ఈపీఎఫ్‌ సభ్యుల కష్టాలన్నీ తీరినట్టే.. ఎందుకంటే.. ఇకపై అన్ని ఈపీఎఫ్ సర్వీసులను సులభంగా చాలా వేగంగా యాక్సస్ చేయొచ్చు.

Read Also : Nothing Phone 3 : నథింగ్ ఫ్యాన్స్‌కు పండగే.. ఏఐ ఫీచర్లతో నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోందోచ్.. ఇదిగో ప్రూఫ్..!

అంతేకాదు.. కొత్త వెర్షన్ ద్వారా పీఎఫ్ అకౌంట్లలో డబ్బును ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇప్పటికే ఈ కొత్త 3.0 వెర్షన్ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈపీఎఫ్‌ఓ 3.0 అంటే ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

EPFO 3.0 అంటే ఏంటి?
ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ (EPFO ​​3.0) ద్వారా పీఎఫ్ నుంచి వేగంగా డబ్బు విత్ డ్రా, డేటా అప్‌డేట్, పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ కూడా గతంలో కన్నా వేగంగా పూర్తి అవుతుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకారం.. ఈపీఎఫ్ఓ కొత్త వెర్షన్ 2025 మే లేదా జూన్ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ ద్వారా 9 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందనున్నారు. పీఎఫ్ ఉద్యోగులు తమ బ్యాలెన్స్‌ను చెక్ చేయాలనుకుంటే.. ఉమాంగ్ (UMANG) యాప్ లేదా మిస్డ్ కాల్, SMS మెథడ్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.

పీఎఫ్ సభ్యులకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? :
ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ : ఇకపై లాంగ్ ఫారమ్‌లను నింపడం లేదా EPFO ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా : త్వరలో ఈపీఎఫ్ఓ ఏటీఎం నుంచి కూడా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
డిజిటల్ కరెక్షన్ : ఇప్పుడు మీరు OTP వెరిఫికేషన్ ద్వారా మీ డేటాను ఆన్‌లైన్‌లో మీరే అప్‌‌డేట్ చేసుకోవచ్చు.
స్పీడ్ ప్రాసెసింగ్ : సమయం ఆదా, అన్ని సర్వీసులు వేగంగా పూర్తి అయ్యేలా డిజిటల్ ఐటీ సిస్టమ్ ఇంటిగ్రేట్ అవుతుంది.

వడ్డీ ఎంతంటే? :
అయితే, కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ ఉద్యోగులకు ఏటా వడ్డీ మొత్తాన్ని అందిస్తుంది. ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని ప్రకటించింది. ఇప్పటికే అమలు చేసిన సెంట్రలైజడ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ నుంచి 78 లక్షలకు పైగా పెన్షనర్లు ప్రయోజనం పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్ పొందే సౌకర్యాన్ని అందిస్తుంది. మంత్రి మాండవీయ ప్రకారం.. ఈపీఎఫ్ఓ రూ. 27 లక్షల కోట్ల ఫండ్ కలిగి ఉంది. పీఎఫ్ ఖాతాదారులకు 8.25శాతం వడ్డీని అందిస్తుంది. మునుపటిలాగా, ఇకపై ప్రాంతీయ బ్యాంకుల్లో మాత్రమే అకౌంట్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు.

హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు :
కేంద్ర ప్రభుత్వం త్వరలో ESIC ఆయుష్మాన్ భారత్ పథకంతో ఇంటిగ్రేట్ చేయనుంది. తద్వారా ఉద్యోగులు, పింఛన్‌దారులు లిస్టెడ్ ఆస్పత్రుల్లో ఉచితంగా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. అదనంగా, ప్రైవేట్ ఛారిటబుల్ ఆస్పత్రలు కూడా ఈ ఇంటిగ్రేట్ సిస్టమ్‌లో చేర్చనున్నారు.

Read Also : Samsung Galaxy S25 Ultra : అద్భుతమైన డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ నెల 30లోగా కొనేసుకోండి..!

ఈపీఎఫ్ఓ 3.0 అనేది కేవలం టెక్నికల్ అప్‌డేట్ కాదు.. కోట్లాది మంది ఉద్యోగులకు అద్భుతమైన గిఫ్ట్. ఇకపై పీఎఫ్ డబ్బు విత్ డ్రా నుంచి పెన్షన్, ఆరోగ్య సంరక్షణ పొందడం వరకు ఇప్పుడు ప్రతిదీ వేగంగా, పారదర్శకంగా సులభంగా పూర్తి కానున్నాయి.