×
Ad

EPFO Alert 2025 : బిగ్ అలర్ట్.. మీ PF డబ్బును ఇలా చెప్పి అసలు విత్‌డ్రా చేయొద్దు.. తస్మాత్ జాగ్రత్త.. పెనాల్టీ, వడ్డీతో మొత్తం వసూలు చేస్తారు!

EPFO Alert 2025 : 2025లో పీఎఫ్ ఫండ్స్ తప్పుడు కారణాలు చెప్పి విత్‌డ్రా చేస్తే జరిమానాలు విధించవచ్చని ఈపీఎఫ్ఓ చందాదారులకు హెచ్చరిక జారీ చేసింది.

EPFO Alert 2025 : మీ పీఎఫ్ అకౌంటులో డబ్బు ఉంది.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా వాడేసుకుంటానంటే ఇక కుదరదు.. సరైన రీజన్ చెప్పి మరి పీఎఫ్ డబ్బు తీసుకోవాలి? లేదంటే భారీమూల్యం చెల్లించుకోక తప్పదు. చాలామంది తమకు ఎమర్జెన్సీ లేకపోయినా రాంగ్ రీజన్ చూపుతూ పీఎం డబ్బులను విత్ డ్రా చేస్తుంటారు. కొందరు అయితే ఊటీ ట్రిప్ కోసమని మరికొంతమంది లగ్జరీ వాచ్ కొని గిఫ్ట్ ఇచ్చేందుకు డబ్బులు తీసుకుంటుంటారు.

కానీ, కారణం మాత్రం మ్యారేజ్ లేదా అనారోగ్యం (EPFO Alert 2025) వంటి ఇతర కారణాలుగా చూపుతారు. ఇలాంటి వారి విషయంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కఠినంగా వ్యవహరిస్తోంది. 2025లో పీఎఫ్ ఫండ్స్ రాంగ్ రీజన్ చెప్పి డబ్బులు విత్ డ్రా చేసేవారిపై భారీగా జరిమానాలను విధించనుంది. అంతేకాదు.. తీసుకున్న మొత్తంపై వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేయనుంది. దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ పీఎఫ్ సభ్యులకు ఒక హెచ్చరిక జారీ చేసింది.

పీఎఫ్ డబ్బుల కోసం ఎవరైనా రాంగ్ రీజన్ చెప్పి నిధులను దుర్వినియోగపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈపీఎఫ్ స్కీమ్ 1952 ప్రకారం.. వడ్డీతో పాటు ఫండ్స్ చందాదారుల నుంచి రికవరీ చేసే అధికారం ఉందని ఈపీఎఫ్ఓ ​​పేర్కొంది. ఈపీఎఫ్ అడ్వాన్సులు వివాహం, విద్య, అనారోగ్యం, గృహనిర్మాణం వంటి నిర్దిష్ట ప్రయోజనాలకే పరిమితమని ప్రకటనలో స్పష్టం చేసింది.

Read Also : Samsung Galaxy S24 Ultra 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

‘మీ భవిష్యత్తును రక్షించుకోండి. మీ పీఎఫ్ డబ్బుల్ని సరైన అవసరాల కోసమే పీఎఫ్ వినియోగించండి. మీ PF మీ జీవితాంతం భద్రతా వలయం’ అని ట్విట్టర్‌ వేదికగా సూచించింది. పీఎఫ్ కార్పస్ దీర్ఘకాలిక పదవీ విరమణ భద్రతా వలయమని, ఆర్థిక ఇబ్బందులను నివారించేందుకు సభ్యులు విత్‌డ్రా రూల్స్ కచ్చితంగా పాటించాలని ఈపీఎఫ్ఓ స్పష్టంచేసింది.

పీఎఫ్ సభ్యులు ఎవరైనా తమ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా కోసం తప్పుడు కారణాన్ని చూపితే.. ఉదాహరణకు.. ఇల్లు కొనుగోలు కోసం అని చెప్పి ఆ తరువాత డబ్బును మరో అవసరానికి వాడుకోవడం చేస్తే.. అప్పుడు ఈపీఎఫ్ఓ ఈ ఫండ్స్ వడ్డీతో సహా వసూలు చేయడంతో పాటు జరిమానా కూడా విధించే హక్కును కలిగి ఉంటుంది.

మీరు చట్టబద్ధంగా PF ఫండ్స్ ఎప్పుడు విత్‌డ్రా చేయొచ్చంటే? :

  • 1952 ఈపీఎఫ్ స్కీమ్ ప్రకారం.. ఫండ్స్ విత్‌డ్రా నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఉంటుంది.
  • వివాహం (స్వయంగా, పిల్లలు లేదా తోబుట్టువులు)
  • పిల్లల విద్య
  • తీవ్రమైన అనారోగ్యం (ఖాతాదారుడు లేదా ఆధారపడినవారు)
  • ఇల్లు కొనడం లేదా నిర్మాణం
  • రిటైర్మెంట్ (58 ఏళ్ల వయస్సులో)
  • ఈ కారణాల వల్ల పీఎఫ్ పాక్షిక విత్‌డ్రాకు అనుమతి ఉంటుంది.
  • అయితే పూర్తి విత్‌డ్రా అనేది సాధారణంగా రిటైర్మెంట్ సమయంలో మాత్రమే అనుమతి ఉంటుంది.

సెక్షన్ 68B(11) రూల్ : దుర్వినియోగానికి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ పథకం సెక్షన్ 68B(11) కింద కఠినమైన రూల్స్ విధిస్తుంది.
ఒక సభ్యుడు విత్‌డ్రా చేసిన ఫండ్స్ దుర్వినియోగం చేస్తున్నట్లు తేలితే 3 ఏళ్ల వరకు విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఉండదు.
మునుపటి మొత్తాన్ని వడ్డీతో పూర్తిగా తిరిగి చెల్లించే వరకు కొత్త అడ్వాన్సులు అప్రూవల్ చేయరు.
ఈ పరిమితితో ఫండ్స్ దుర్వినియోగం కాకుండా వారి భవిష్యత్తులో మాత్రమే వినియోగానికి వీలుంటుంది.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా కీలక డాక్యుమెంట్లు  :

  • పీఎఫ్ సభ్యులు వివిధ ఫారమ్‌లను ఉపయోగించి UAN పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌లను దాఖలు చేయవచ్చు.
  • ఫారం 19 : పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్
  • ఫారం 10-C : పెన్షన్ విత్‌డ్రా బెనిఫిట్స్
  • ఫారం 31 : పాక్షిక ఉపసంహరణ

ఆన్‌లైన్ క్లెయిమ్‌ దాఖలుకు ఈ కింది షరతులను పాటించాలి :

  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన యాక్టివ్ UAN నెంబర్ కలిగి ఉండాలి.
  • ఈపీఎఫ్ఓ డేటాబేస్‌తో ఆధార్ లింక్, eKYCతో పాటు వెరిఫకేషన్ పూర్తి అయి ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్ రికార్డులలో అప్‌డేట్ చేసి ఉండాలి.
  • 5 ఏళ్ల కన్నా తక్కువ సర్వీసు ఉంటే ఫైనల్ సెటిల్మెంట్ కోసం PAN కార్డు లింక్ చేసి ఉండాలి.

2025లో కొత్త విత్‌డ్రా లిమిట్స్ :
జూన్ 2025లో ఈపీఎఫ్ఓ ​​ఆటో-సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీని వలన సభ్యులు చిన్న అవసరాల కోసం ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఈపీఎఫ్ఓ హెచ్చరికతో పీఎఫ్ ఫండ్స్ అత్యవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే, ఎవరైనా ఫండ్స్ దుర్వినియోగం చేస్తే ఆ మొత్తంతో పాటు వడ్డీ, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే భవిష్యత్తులో భవిష్యత్తులో అవసరమైనప్పుడు విత్‌డ్రా చేసుకునే అవకాశం కోల్పోతారు.

పీఎఫ్ విత్‌డ్రా కొత్త రూల్స్ ఏంటి? :
ఈపీఎఫ్ స్కీమ్ 1952 ద్వారా విత్‌డ్రాకు నిబంధనలివే :

  • ఫైనల్ సెటెల్మెంట్ : రిటైర్మెంట్ (58 సంవత్సరాలు) లేదా ఉద్యోగం మానేసినప్పుడు పూర్తి PF విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • పాక్షిక ఉపసంహరణ (అడ్వాన్స్) : వివాహం, విద్య, ఇంటి కొనుగోలు/నిర్మాణం, వైద్యం, నిరుద్యోగం.
  • లిమిట్ : పీఎఫ్‌లో 75శాతం (విత్‌డ్రా తర్వాత మిగిలిన 25శాతం) లేదా 3 నెలల కనీస వేతనం (ఏది తక్కువైతే అది).
  • డాక్యుమెంట్లు : UAN, ఆధార్, బ్యాంక్ వివరాలు, PAN (5 ఏళ్ల కన్నా తక్కువ సర్వీస్), ఇన్‌స్టంట్ ఆన్‌లైన్ క్లెయిమ్ (కాంపోజిట్ క్లెయిమ్ ఫారం).
  • 2025 అప్‌డేట్ : అడ్వాన్స్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెరిగింది.
  • ATM/UPI విత్‌డ్రాలు ఇప్పుడు ఈపీఎఫ్ఓ ​​3.0లో అందుబాటులో ఉన్నాయి.
  • పీఎఫ్ విత్‌డ్రాకు KYC పూర్తి అయి ఉండాలి.