EPFO : ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఇకపై మీ పీఎఫ్ విత్‌డ్రాకు క్యాన్సిల్ చెక్ అక్కర్లేదు.. కేవలం 2 రోజుల్లోనే డబ్బులు పడతాయి..!

EPFO : ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బులను ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా కోసం క్యాన్సిల్ చెక్కును అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలో డబ్బులు అకౌంట్‌లో జమ అవుతాయి.

EPFO Big Decision

EPFO Big Decision : ఈపీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రావిడెంట్ ఫండ్ (EPFO) విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇప్పటినుంచి ప్రావిడెంట్ ఫండ్ (PF) నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవడం చాలా సులభం.

గతంలో కన్నా వేగంగా మీ పీఎఫ్ డబ్బులను అకౌంట్లలో జమ అవుతాయి. ఇప్పుడు మీ పీఎఫ్ ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసే సమయంలో క్యాన్సిల్ చెక్కును అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. కంపెనీ లేదా ఎంప్లాయర్ నుంచి అనుమతి కూడా పొందవలసిన అవసరం లేదు.

Read Also : MG Windsor EV : కారు అంటే ఇలా ఉండాలి.. ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు చూశారా? సింగిల్ ఛార్జ్‌తో 332 కి.మీ రేంజ్..!

ఇప్పుడు చెక్కు లేదా కంపెనీ అనుమతి లేకుండా పీఎఫ్ నుంచి డబ్బు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మార్పుతో అన్ని ఉద్యోగులకు భారీ ఉపశమనం కలుగుతుంది. పీఎఫ్ డబ్బులను డబ్బును విత్‌‌డ్రా ఆలస్యం అసలు ఉండదు.

ఈపీఎఫ్ కొత్త నిర్ణయం ఏంటి? :

  • ఇప్పుడు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసేందుకు క్యాన్సిల్ చెక్కు లేదా పాస్‌బుక్ ఫోటోను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
  • బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఇకపై కంపెనీ అప్రూవల్ అవసరం లేదు.
  • మీరు మీ బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకుంటే, ఆధార్ OTPతో మీరే కొత్త అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు.

ఇదివరకు ఏం జరిగేది? :

  • గతంలో పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే చాలా సమయం పట్టేది.
  • బ్యాంకు అకౌంట్ చెక్ చేయడానికి 3 రోజులు సమయం పట్టేది.
  • గతంలో కంపెనీ నుంచి అనుమతి పొందడానికి 13 రోజుల వరకు పట్టేది.
  • ఇప్పుడు ఇవన్నీ తొలగించారు.
  • ఈ ప్రక్రియ చాలా వేగంగా రెండు రోజుల వ్యవధిలోనే పూర్తి అవుతుంది.

ఎంత మందికి ప్రయోజనం చేకూరుతుంది? :
ప్రస్తుతం, ఈపీఎఫ్ఓలో దాదాపు 7.74 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 4.83 కోట్ల మంది బ్యాంకు అకౌంట్లు వారి UANతో లింక్ అయి ఉన్నాయి. ఎంప్లాయర్ అప్రూవల్ లేని కారణంగా దాదాపు 15 లక్షల మంది పీఎఫ్ క్లెయిమ్‌లు నిలిచిపోయాయి. ఇప్పుడు వారికి ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది.

ప్రభుత్వం ఏం చెప్పింది? :
మీరు పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ ఇప్పటికే వెరిఫికేషన్ అయి ఉంటాయి. ప్రత్యేకించి డాక్యుమెంట్ల అవసరం లేదని కార్మిక మంత్రిత్వ శాఖ చెబుతోంది.

Read Also : Ration Card e-KYC : బిగ్ అలర్ట్.. మీ రేషన్ కార్డు e-KYC చేయలేదా? ఈ తేదీలోగా చేయకపోతే ఫ్రీ రేషన్ కట్..!

పీఎఫ్ విత్‌డ్రా బెనిఫిట్స్ ఏంటి? :

  • పీఎఫ్ విత్‍డ్రా ఇప్పుడు గతంలో కన్నా వేగంగా సులభంగా ఉంటుంది.
  • ఏ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
  • కంపెనీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
  • అన్నీ  మీరే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.