ఇక ప్రాసెస్ సులభం : ఈపీఎఫ్ఓలో e-inspection సిస్టమ్

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో కొత్త విధానం రానుంది. త్వరలో తనిఖీ ప్రక్రియ సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఈ-తనిఖీ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.

  • Publish Date - August 27, 2019 / 09:13 AM IST

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో కొత్త విధానం రానుంది. త్వరలో తనిఖీ ప్రక్రియ సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఈ-తనిఖీ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో కొత్త విధానం రానుంది. త్వరలో తనిఖీ ప్రక్రియ సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఈ-తనిఖీ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. సంస్థల్లో భౌతిక తనిఖీ ప్రక్రియ అవసరం లేకుండా ఈ-తనిఖీ వ్యవస్థను అమల్లో తీసుకురానున్నట్టు సెంట్రల్ ప్రొవిడియంట్ ఫండ్ కమిషనర్ సునీల్ భరత్వాల్ తెలిపారు. వేతనదారుల ఫిర్యాదులను తగ్గించడానికి విచారణ కాలాన్ని గరిష్టంగా రెండేళ్లకు పరిమితం చేసే చట్టాన్ని సవరించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించినట్లు ఆయన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ-ఆర్గనైజ్డ్ ఇంటరాక్టివ్ సెషన్‌లో చెప్పారు. డేటాలో వేతనదారుల డేటా మిస్ మ్యాచ్ కారణంగా కొద్దిశాతం మంది ఉద్యోగులు 12 సంఖ్యల UAN నెంబర్ జనరేట్ చేసుకోలేకపోతున్నారు. 

ఈపీఎఫ్ఓలో అందరి ఉద్యోగులకు UAN తప్పనిసరిగా మారింది. అయితే ఈపీఎఫ్ఓలో డేటాతో ఉద్యోగుల డేటా సరిపోలకపోవడంతో ఈ సమస్య తలెత్తున్నట్టు భరత్వాల్ చెప్పారు. ఉద్యోగుల డేటాబేస్‌లో సమస్యల పరిష్కారానికై తాత్కాలిక ధ్రువీకరణ విధానాన్ని అమల్లోకి తీసుకోచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు. KYC (Know your Customer) విషయంలో వచ్చిన ఫిర్యాదులను మూడు రోజుల కాలపరిమితిలోగా పరిష్కరించే దిశగా ఈపీఎఫ్ఓ పనిచేస్తోంది.

ఆధార్‌తో UAN, బ్యాంకు అకౌంట్ నెంబర్, రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే KYC ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈపీఎఫ్ఓలో ఆఫ్ లైన్ క్లయమ్ చేసే విధానాన్ని డిజిటల్ , యాప్ బేసిడ్ ప్లాట్ ఫాంలో మార్చేసినట్టు ఈపీఎఫ్ఓ అధికారులు చెప్పినట్టు ఒక ప్రకటన తెలిపింది. వచ్చే దశలో బిగ్ డేటా ఎనాలిటకల్ ప్లాట్ ఫాం ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఈపీఎఫ్ఓ అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.