PF Account Transfer
PF Account Transfer : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీరు జాబ్ మారుతున్నారా? అయితే ఇది మీకోసమే.. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే ఉద్యోగులు ఇకపై తమ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయొచ్చు.
ఈపీఎఫ్ఓ ఉద్యోగం మారే సమయంలో పీఎఫ్ ఖాతాలను బదిలీ చేసే ప్రక్రియను మరితం సులభతరం చేసింది. ఇప్పటివరకూ అనేక సందర్భాల్లో కంపెనీ యజమాని నుంచి ఆమోదం పొందాల్సి ఉండేది. కానీ, ఇకపై అలా ఉండదు. ఇదే విషయాన్ని ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది.
ఫారమ్ 13 అప్‌గ్రేడ్.. ట్రాన్స్‌ఫర్ వేగవంతం :
మొన్నటివరకూ పీఎఫ్ అకౌంట్ల బదిలీ విషయంలో రెండు ఈపీఎఫ్ ఆఫీసులతో పని ఉండేది. పీఎఫ్ మొత్తాన్ని సోర్స్ ఆఫీస్ నుంచి డెస్టినేషన్ ఆఫీస్‌కు క్రెడిట్ చేయడం జరిగేది. ఇప్పటినుంచి ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఫారమ్ 13 సాఫ్ట్‌వేర్ ఫంక్షనాలిటీని అప్‌గ్రేడ్ చేసింది.
తద్వారా డెస్టినేషన్ ఆఫీసులో అన్ని ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్స్ ఆమోదం అవసరం ఉండదు. ఇకమీదట, సోర్స్ ఆఫీసులో ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ అప్రూమవ్ చేశాక మునుపటి అకౌంట్ ఆటోమాటిక్‌గా డెస్టినేషన్ ఆఫీసుకు సభ్యుని ప్రస్తుత అకౌంటుకు తక్షణమే బదిలీ అవుతుంది.
తద్వారా 1.25 కోట్ల మందికి పైగా పీఎఫ్ సభ్యులు ప్రతి ఏడాది దాదాపు రూ.90వేల కోట్ల అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ వేగవంతం అవుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, సభ్యుల అకౌంట్లలో నిధులను సకాలంలో క్రెడిట్ చేసేందుకు సభ్యుల ఐడీ, అందుబాటులో ఉన్న ఇతర సభ్యుల సమాచారం ఆధారంగా UAN బల్క్ జనరేట్ చేసే సౌకర్యం తీసుకొచ్చింది.
ఆధార్ సీడింగ్ తర్వాతే UAN యాక్టివేషన్ :
ఫామ్ 13 సాఫ్ట్‌వేర్ ఫంక్షనాలిటీతో FO ఇంటర్‌ఫేస్ ద్వారా ఫీల్డ్ ఆఫీసుకు అందుబాటులో ఉంటుంది. అయితే, రిస్క్ తగ్గించేందుకు ఆధార్ లేకుండా జనరేట్ చేసిన UAN నంబర్లు ఇన్‌యాక్టివ్ స్టేటస్‌లో ఉంటాయి. ఆధార్ సీడింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే యాక్టివ్ అవుతాయి.
ఆధార్‌తో లింక్ అయిన ఈపీఎఫ్ అకౌంట్లలో e-KYC పూర్తి చేసిన ఈపీఎఫ్ఓ సభ్యులు EPFని ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అయితే, దీనికి కంపెనీ ఎంప్లాయిర్ నుంచి ఎలాంటి సాయం అవసరం లేదు. ఆధార్ OTP ద్వారా ఆటోమాటిక్‌గా ట్రాన్స్‌ఫర్ పూర్తవుతుంది. e-KYC పూర్తయిన సభ్యులు ఆధార్ OTP ద్వారా నేరుగా EPFOకి తమ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్‌ను దాఖలు చేయవచ్చు.
దాంతో ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్స్ పాత కంపెనీ వద్ద పెండింగ్‌లో ఉండవు. అత్యంత వేగంగా ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అంతేకాదు.. ఈపీఎఫ్ఓ వ్యక్తిగత డేటాను అప్‌డేట్ చేసేందుకు సభ్యులకు సెల్ఫ్ అప్రూవల్ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఎంప్లాయిర్ లేదా ఈపీఎఫ్ఓ నుంచి అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండదు. పీఎఫ్ సభ్యులు తమ అకౌంట్ నుంచి నేరుగా UAN యాక్టివేట్ చేసి అప్‌డేట్ చేసుకోవచ్చు.